Newsఅదిరిపోయే లుక్ లో బన్ని.. పేరుకు తగ్గట్టే రచ్చ చేశాడు..!

అదిరిపోయే లుక్ లో బన్ని.. పేరుకు తగ్గట్టే రచ్చ చేశాడు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కతం వంశీ డైరక్షన్ లో ‘నా పేరు సూర్య’ సినిమాలో నటిస్తున్నాడు. రచయితగా ఉన్న వంశీ మొదటిసారి దర్శకుడిగా మారి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. లగడపాటి శిరీష్ శ్రీధర్ తో పాటుగా మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ప్రకారం ‘నా పేరు సూర్య’ నా ఇల్లు ఇండియా అనేది ఉప శీర్షిక.. సినిమాలో అల్లు అర్జున్ జవాన్ గా కనిపిస్తాడని టాక్. బన్ని సోల్జర్ గా ఎలా ఉంటాడు.. అతని లుక్ ఎలా ఉండబోతుంది అన్న విషయాల మీద ఫ్యాన్స్ చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. అయితే నిన్న జరిగిన ట్రాఫిక్ రూల్స్ అవగాహన కార్యక్రమంలో బన్ని అటెండ్ అవడం తన లుక్ తో అందరికి సర్ ప్రైజ్ చేయడం జరిగింది.

ఆర్మీ కటింగ్ లో బన్ని లుక్స్ అదుర్స్ అని చెప్పాలి. క్యారక్టర్ ఎలా ఉంటుందో తన లుక్ తోనే చెప్పేసిన బన్ని అదే రేంజ్ కథతో కూడా వస్తాడని అనిపిస్తుంది. రీసెంట్ గా వచ్చిన దువ్వాడ జగన్నాధం సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన బన్ని నాపేరు సూర్య సినిమాతో కూడా అదే రేంజ్ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు. అను ఎమాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news