సుకుమార్ రామ్ చరణ్ కలిస్తే ఇలా ఉంటుంది

ram charan sukumar rangasthalam

2018 సంక్రాంతికి “రంగస్థలం 1985” సినిమాను విడుదల చేయడానికి శరవేగంగా సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు సుకుమార్. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ కెరీర్ లోనే ‘బెస్ట్’ మూవీగా నిలబడిపోతుందన్న టాక్ ను ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలలో క్రియేట్ చేసిన ఈ సినిమాకు సంబంధించి, ఇప్పటివరకు టైటిల్ లోగో మాత్రమే అధికారికంగా విడుదల కాగా, ఆన్ లొకేషన్ కు సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

అందులో భాగంగానే తాజాగా ఓ స్టిల్ వైరల్ అయ్యింది. శరవేగంగా దూసుకెళ్తున్న సుకుమార్ ను ఒక్క క్షణం ఆగమన్నట్లుగా రామ్ చరణ్ పట్టుకున్న ఈ స్టిల్ మెగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా ఉంది. ఎందుకంటే, ఈ షర్టు భుజంపై వేసుకున్న చెర్రీ, ‘ధృవ’ కోసం పెంచిన కండలను ప్రదర్శిస్తున్నాడు. మొత్తానికి ‘లెక్కల మాస్టార్’ స్పీడ్ చూసి రామ్ చరణే షాక్ అయ్యాడు అనిపించేలా విధంగా ఉన్న ఈ స్టిల్ ఒక్క మెగా ఫ్యాన్స్ నే కాదు, సినీ ప్రేమికుల ఆదరణ కూడా పొందుతోంది.

Leave a comment