Moviesజైలవకుశ....ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయని థ్రిల్లింగ్ గెస్ట్ అప్పీయరెన్స్

జైలవకుశ….ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయని థ్రిల్లింగ్ గెస్ట్ అప్పీయరెన్స్

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సర్దార్ లాంటి ఫ్లాప్ ఇచ్చిన బాబీకి ఎన్టీఆర్ ఎందుకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు? సినిమా అనౌన్స్ చేసిన వెంటనే చాలా మందికి వచ్చిన సందేహం ఇదే. కానీ టెంపర్ సినిమా నుంచీ కూడా సినిమాల ఎంపికలో సూపర్బ్ అనే స్థాయిలో సక్సెస్ అవుతున్న ఎన్టీఆర్‌ని మెప్పించాడంటే బాబీ ఏదో మేజిక్ చేసే ఉంటాడని చాలా మంది నమ్మారు. ఇప్పుడు ఎన్టీఆర్-బాబీ సినిమాకు సంబంధించి బయటకు వస్తున్న అప్‌డేట్స్ అన్నీ కూడా సినిమాపైన మేజికల్ ఆకర్షణను క్రియేట్ చేస్తోంది.

జైలవకుశ అనే టైటిలే సెన్సేషన్ అయింది. ఇక ఈ సినిమాలో ముగ్గురు ఎన్టీఆర్‌లు కనిపిస్తారన్న న్యూస్ బయటకు రాగానే సినిమాకు 85 కోట్ల బిజినెస్ ఆపర్ వచ్చింది. మూడు క్యారెక్టర్స్‌లో ఒక క్యారెక్టర్‌లో నెగిటివ్ షేడ్స్‌తో ఉంటాడన్న న్యూస్ అయితే సినిమా లవర్స్ అందరికీ కూడా ఆసక్తి క్రియేట్ చేసేలా ఉంది. ఎన్టీఆర్‌లాంటి ది బెస్ట్ యాక్టర్…విలన్ క్యారెక్టర్‌లో కనిపిస్తే ఏ స్థాయిలో నటించి ఉంటాడో చూడాలన్న ఆసక్తి ఓ రేంజ్‌లో ఉంది. ఇక ఇప్పుడు ఇంకో సూపర్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో కలిసి నాలుగు సినిమాల్లో యాక్ట్ చేసిన సమంతా ఇప్పుడు ఈ సినిమాలో ఐదు నిమిషాల గెస్ట్ రోల్ చేయనుందట. సమంతా-ఎన్టీఆర్‌ల కాంబినేషన్ సక్సెస్ రేట్ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఇప్పుుడు మరోసారి జైలవకుశ కూడా అదే స్థాయి మేజిక్ క్రియేట్ చేయడం ఖాయమని సినిమా విశ్లేషకులు చెప్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news