News ఐదేళ్ల కొడుకుతో ‘ఆ పాడు పని’ చేయిస్తున్న కిలేడీ తల్లి

ఐదేళ్ల కొడుకుతో ‘ఆ పాడు పని’ చేయిస్తున్న కిలేడీ తల్లి

A WOMAN has been using her son to lookout while she ransacks mailboxes at a gated community in Melbourne’s northwest.

తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుతూ తల్లులు వారికి చిన్నతనం నుంచే నీతులో బోధిస్తారు. ఎలాంటి పాడు పని చేయకుండా బుద్ధిగా ఉండాలని చెబుతారు. కానీ.. ఓ మహిళ మాత్రం ‘అమ్మ’ అనే పదానికి మచ్చతెచ్చేలా వ్యవహరించింది. తన కొడుకుతో చేయరాని పనులు చేయిస్తూ.. సభ్యసమాజం తలదించుకేనేలా చేసింది. డబ్బులు సంపాదించడానికి అక్రమార్గాలను ఎంపిక చేసుకున్న ఆమె.. అందుకు తన కొడుకుని వారధిలా వాడుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఓ మహిళ డబ్బులు సంపాదించడం కోసం ఓ అక్రమమార్గాన్ని ఎంచుకుంది. అలాఅని ఆమె ఇళ్లలోకి చొరబడదు.. బయట ఉండే మెయిల్ బాక్సుల నుంచి చాలా తెలివిగా ఉత్తరాలు, క్రెడిట్ కార్డులు, బ్యాంకుల వివరాలు, ఇంకా ఇతరత్ర రహాస్యాలు దొంగలిస్తుంది. ఇంటికి కన్నమెయ్యకుండానే ఇంటిగుట్టు పసిగట్టి పనిచక్కబెట్టుకుంటుంది. అందుకోసం.. తన ఐదేళ్ల కొడుకుని కూడా వాడుకుంటోంది. సంపన్నుల ఇంటిచుట్టూ ఎవరూలేని సమయంలో.. తన కొడుకుని ఇళ్లముందు కాపుగా పెడుతుంది. ఆపై తాను మెయిల్ బాక్సుల్లోని పత్రాలను సైలెంట్‌గా దొంగలిస్తుంది. ఈలోగా ఎవరైనా వస్తే.. ఈ బుడతడు తల్లికి సైగచేసి చెబుతాడు. అంతే.. మరుక్షణమే తన తనయుడ్ని తీసుకుని అక్కడినుంచి కారులో పరారవుతుంది.

ఓసారి ఈమె బండారం సీసీటీవీ కెమెరాకి చిక్కింది. దాంతో అవాక్కయిన స్థానికులు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని అనుకున్నారు. ఓసారి అలాంటి ప్రయత్నమే చేశారు కానీ.. ఆ కిలేడీ మాత్రం చాలా నేర్పుగా తప్పించుకుపోయింది. ఆమె ఎవరి కంటబడినా వెంటనే ‘క్రైమ్ స్టాపర్స్’కి ఫోన్ చేయాలని పేర్కొన్నారు. అయితే.. స్థానికుల ఆందోళన ఆ మహిళ దొంగలిస్తున్న ఉత్తరాల గురించి కాదనీ, ఆ చిన్న పిల్లాడి గురించేనని చెబుతున్నారు. చిన్నపిల్లల్ని ఇలాంటి పనుల కోసం ఉపయోగించుకోవడం మానవ సంబంధాలకు పెను ప్రమాదమని ఓ మహిళ పేర్కొంది.

https://youtu.be/mZ7BcokScNw

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news