Movies‘శాతకర్ణి’పై వచ్చిన రూమర్లపై మండిపడ్డ క్రిష్.. దెబ్బ అదుర్స్ కదూ!

‘శాతకర్ణి’పై వచ్చిన రూమర్లపై మండిపడ్డ క్రిష్.. దెబ్బ అదుర్స్ కదూ!

Director Krish given clarity on Gautamiputra Satakarni rumours which gone viral on social media.

ఈనెల 16వ తేదీన విడుదలైన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్‌పై దేశవ్యాప్తంగా ఎన్ని ప్రశంసలు దక్కాయో.. అన్నే విమర్శలు కూడా వచ్చాయి. ఇందులో చూపించిన విజువల్ వండర్స్ అన్నీ బాలీవుడ్ మూవీ ‘బాజీరావ్ మస్తానీ’ నుంచి కాపీ కొట్టారని కామెంట్స్ వినిపించాయి. చారిత్రాత్మక సినిమా పేరిట క్రిష్ వేరే సినిమా విజువల్స్‌ని ఎత్తేశారని, వాటినే ‘శాతకర్ణి’ ట్రైలర్‌లో చూపించాడని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని దర్శకుడు క్రిష్ మండిపడ్డాడు.

‘‘శాతకర్ణి’లో చూపించిన విజువల్స్‌ని ‘బాజీరావ్ మస్తానీ’ నుంచి కాపీ కొట్టినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. తెలుగువారు గౌరవించేలా ఈ సినిమాని తెరకెక్కించాం.. అలాంటి చారిత్రాత్మక చిత్రంపై ఈ తరహా ఆరోపణలు చెయ్యడం సరికాదు’ అని క్రిష్ ఫైర్ అయ్యాడు. అసలు ఈ చిత్రం మరే ఇతర సినిమాతో పోలిక లేదని, ఇది అసలు సిసలైన తెలుగు మూవీ అని, ఇలాంటి చిత్రంపై నిందలు వేయడం తగవని అన్నాడు. ఈ చిత్రంలో విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయని, ట్రైలర్‌లో చూపించింది చాలా తక్కువని, ఈ విజువల్స్ కోసమే తమ చిత్రబృందం రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమించిందని క్రిష్ క్లారిటీ ఇచ్చాడు. ‘ఎంతో కష్టపడి పనిచేస్తే.. దానికి మీరిచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ రూమర్‌రాయుళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

క్రిష్‌లాగే చాలామంది సినీజనాలు, నందమూరి అభిమానులు ఆ రూమర్లపై ఫైర్ అవుతున్నారు. తెలుగు వాడైనా గౌతమీపుత్రుడు కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మరాఠా వీరుడు బాజీరావ్ మస్తానీ మీద తీసిన చిత్రానికి పోలిక పెట్టడమేమిటి అని.. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని చెబుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news