దక్షిణాది ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఇలియానా

ileana dcruz sensational comments on south film industry

Ileana dcruz another time makes sensational comments on south film industry in the recent interview.

గోవాబ్యూటీ ఇలియానా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో.. తెలుగు చిత్రపరిశ్రమ ఆమెని తలపై ఎక్కించుకొని మోసింది. ఎందరో స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ.. ఈమెకి ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చింది. అయితే.. ఈ అమ్మడు బాలీవుడ్ మోజుతో దక్షిణాది పరిశ్రమని చిన్నచూపు చూసింది. స్టార్టింగ్‌లో అక్కడ వరుసగా మంచి ఆఫర్లు రావడంతో.. హిందీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిపోయే రోజులొచ్చాయనుకుని సౌత్ ఇండస్ట్రీపై విమర్శలు చేసింది కూడా. అయితే.. తాను అనుకున్నట్లుగా అక్కడ అవకాశాలు అంతగా రాలేదు. మొదట్లో బాలీవుడ్ కాస్త అక్కన జేర్చుకున్నా.. ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో.. అమ్మడు మళ్ళీ సౌత్‌లో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది.

కానీ.. దక్షిణాది పరిశ్రమ ఆమెని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక్కడి దర్శకనిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ.. ఎవరూ ఆమెకి అవకాశాలు ఇవ్వడం లేదు. ఒకానొక సమయంలో కొన్నాళ్లు సౌత్‌లో చక్కర్లు కొట్టింది కూడా. కానీ.. ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికీ ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ.. సౌత్ ఇండస్ట్రీ మాత్రం ఆమెని పట్టించుకోవట్లేదు. దీంతో.. దక్షిణాది సినిమా తనను పక్కన పెట్టేసిందని ఈ గోవాబ్యూటీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం హిందీలో ఒకటి, రెండు చిత్రాలే చేస్తున్న తనకి.. దక్షిణాదిలో ఒక్క అవకాశం కూడా రావడం లేదని తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది. కారణం ఏంటో తనకు తెలియడం లేదని అంటోంది. ఈ క్రమంలోనే తాను ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని కూడా ఈ అమ్మడు పంచుకుంది.

‘రీసెంట్‌గా ఒక తెలుగు దర్శకుడు నన్ను సంప్రదించి.. ఓ కథ కథ చెప్పారు. ఆ సినిమాలో నేనే కథానాయిక అని నమ్మపలికారు. అంతే.. మళ్లీ కంట పడలేదు. ఇప్పుడా చిత్రంలో వేరే నటి నటిస్తోందని తెలిసింది. నన్నెందుకు తొలగించారని ఆ దర్శకుడిని ప్రశ్నిస్తే.. సారీ అని ఫోన్‌ పెట్టేశారు’ అని తెలిపింది. దక్షిణాది దర్శక నిర్మాతల నుంచి మంచి పాత్రలో నటించే అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నానని ఇలియానా పేర్కొంది. ఇక్కడ ఇలియానా చెప్పదలచుకున్నదేమిటంటే.. తానూ ఏ తప్పూ చేయలేదని, దక్షిణాది పరిశ్రమే తనని పక్కనపెట్టేసిందని అభిప్రాయం వెల్లడిస్తోంది. అంటే.. ఇండైరెక్ట్‌గా ఆమె సౌత్ ఇండస్ట్రీని విమర్శిస్తున్నట్టేగా!

Leave a comment