2.0 – ఆఫీషియల్ టీజర్ [తెలుగు]మాటల్లేవ్.. మాట్లాడుకోటాల్లేవ్..!

32

సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 2.ఓ. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా టీజర్ ఉంది. చిట్టి ది రోబోట్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. తమకి వచ్చిన సమస్య నుండి కాపాడేందుకు చిట్టిని రంగంలో దింపుతారు.

సినిమాలో విలన్ గా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ లో ప్రెస్టిజియస్ గా వస్తున్న 2.ఓ టీజర్ మాత్రం మాటల్లేవ్ అన్నట్టుగా చేసింది. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో కాని అప్పటి వరకు ఆడియెన్స్ ఊహలకు మాత్రం ఆకాశమే హద్దు అనేలా ఉంది.

Leave a comment