Gossipsవరుణ్ దెబ్బకి మెగా ఫ్యామిలీ బోల్తా..!

వరుణ్ దెబ్బకి మెగా ఫ్యామిలీ బోల్తా..!

మెగా హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు తాపత్రయపడుతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ శుక్రవారం అంతరిక్షం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా చూసిన వారెవరైనా ఇదో పెద్ద సాహసమే అనక తప్పదు. మెగా ఇమేజ్ తో ఎంచకా రొటీన్ రెగ్యులర్ మాస్ మసాల సినిమాలు చేయకుండా వరుణ్ తేజ్ ఎందుకు ఇలాంటి కథలను సెలెక్ట్ చేస్తున్నాడని అందరు అనుకుంటున్నారు. అయితే అదే అతనికి సెపరేట్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

ఫిదా తర్వాత తొలిప్రేమతో హిట్ అందుకున్న వరుణ్ తేజ్ కొత్త కథలకు, ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్నాడు. అయితే అంతరిక్షం మాత్రం మొదటి తెలుగు స్పేస్ మూవీగా అంచనాలు పెంచుకుంది. సంకల్ప్ రెడ్డి తను ఇంతకుముందు చేసిన ఘాజి సినిమా తరహాలోనే అంతరిక్షం స్పేస్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తరెకెక్కించాడు. సినిమా ఎలా ఉంది.. దర్శకుడు ఏం చేశాడు అనే దానికన్నా వరుణ్ తేజ్ ఇలాంటి సినిమాలను ఒప్పుకున్నందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఇలానే ప్రయోగాలు చేస్తూ అతని కెరియర్ సాగించాలని ఆశిస్తున్నారు మెగా ఫ్యాన్స్. అయితే వరుణ్ తేజ్ తో ఈక్వల్ గా కెరియర్ ప్రారంభించిన సాయి ధరం తేజ్ మాత్రం ట్రాక్ తప్పేశాడు. ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఒకే రకమైన సినిమాలు చేస్తూ వచ్చాడు. అది అతని కెరియర్ మీద దెబ్బ పడేలా చేశాయి. మొత్తానికి వరుణ్ తేజ్ సినిమాలు మెగా కాంపౌండ్ లోనే ఓ కొత్త ఉత్సాహాన్ని తెచ్చాయని తెలుస్తుంది. అంతరిక్షం మంచి ప్రయత్నంగా ఆడియెన్స్ నుండి రెస్పాన్స్ అందుకుంది. అయితే సినిమాకు ఇంకాస్త జాగ్రత్తలు తెసుకుని ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేదని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news