Gossipsబాలయ్య హీరోయిన్ పై మోజు పడ్డ మహేష్..!

బాలయ్య హీరోయిన్ పై మోజు పడ్డ మహేష్..!

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా … ఆయన 25 వ సినిమాగా .. తెరకెక్కుతున్న ” మహర్షి” సినిమాపై రోజుకో ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన జిగేల్ రాణి గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేసుకుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో పూజ హెగ్డే పాల్గొంది.
2
అయితే ఇప్పటివరకు బయటకి పొక్కకుండా ఉన్న విషయం ఏంటి అంటే..? ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందట. ఆమె పేరు సోనాల్ చౌహాన్. తొలిసారిగా ఆమె మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది .ఈ సినిమాలో … మహేష్ మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. స్టూడెంట్ గా, బిజినెస్ మెన్ గా, రైతు సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా కనిపించబోతున్నాడు.
1
స్టూడెంట్ గా ఉన్నప్పుడు పూజా తో రొమాన్స్ చేస్తే.. బిజినెస్ మెన్ గా ఉన్నప్పుడు సోనాల్ చౌహాన్ కి కనెక్ట్ అవుతాడట. మొదట సోనాల్ చౌహాన్ కి బదులు మెహ్రీన్ అనుకున్నారు కానీ ఏమైందో ఏంటో ఆమె ప్లేస్ లోకి సోనాల్ చౌహాన్ వచ్చింది.ఇక సోనాల్ విషయానికి వస్తే… లెజెండ్ , పండగ చేస్కో.. డిక్టేటర్ వంటి సినిమాల్లో ఈమె నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా అమెరికా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్స్ కూడా వేసారట. పీవీపీ, దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news