Gossipsపాయల్ పై కన్నెసిన దర్శకుడు..!

పాయల్ పై కన్నెసిన దర్శకుడు..!

ఈ మద్య ఒక్క సినిమాతో హరో, హీరోయిలు బాగా పాపులర్ అవుతున్నారు. గత యేడాది అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ‘ఆర్ ఎక్స్ 100’సినిమా వచ్చింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పూత్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో పాయల్ గ్లామర్ డోస్ బాగానే పెంచింది. హాట్ సీన్లు..లిప్ లాక్ సీన్లు, బెడ్ రూమ్ సీన్లలో దుమ్మురేపింది. దాంతో ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో ఈ అమ్మడికి తెలుగు, తమిళ భాషల్లో వరుసగా ఛాన్సులు రావడం మొదల య్యాయి. ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కూడా ఓ పాటలో నటించింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాల్లో నటించడంతో పాటు తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సీత’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు తేజ మాట్లాడుతూ.. పాయల్‌పై ప్రశంసలు కురిపించాడు. టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న నటీమణుల్లో పాయల్ ఒకరని ఆయన అన్నారు.

ఆమె ఎప్పుడు రిహార్సల్స్‌కి రమ్మన్నా వస్తుందని, కొరియోగ్రాఫర్ చెప్పింది చెప్పినట్లు చేస్తుందని అంటూ తెగ మెచ్చుకున్నాడు. సాధారణంగా తేజ అంటే నటులు భయపడి పోతుంటారు..అలాంటిది ఆయననే మెప్పించిందంటే..తన నెక్ట్స్ సినిమాలో పాయల్ నే హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news