Gossipsపవన్ మూడు పెళ్లిళ్లపై నాగబాబు షాకింగ్ కామెంట్స్..!

పవన్ మూడు పెళ్లిళ్లపై నాగబాబు షాకింగ్ కామెంట్స్..!

సినిమాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడు అన్న విషయం మీద ఎవరు దృష్టి పెట్టలేదు. కాని ఎప్పుడైతే అతను రాజకీయాల్లోకి వచ్చాడో ప్రత్యర్ధులంతా అతని పర్సనల్ ఎటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం ఎప్పుడు హాట్ న్యూస్ అవుతుంది. ఈమధ్య వైసిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కూడా పవన్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో పవన్ మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు మోరల్ సపోర్ట్ గా ఉండే నాగబాబు ఇప్పుడు అతని పెళ్లిళ్ల గురించి మాట్లాడాడు.

ప్రత్యర్ధులు గూబ అదిరేలా నాగబాబు సమాధానం ఇచ్చాడు. పవన్ మొదటి భార్య తన ఇష్టపూర్వకంగానే బయటకు వెళ్లిందని. ఇద్దరు విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారని అన్నాడు. ఇక రేణు దేశాయ్ తో పెళ్లి వాళ్లు కూడా డైవర్స్ తీసుకోవడం జరిగింది. అయితే ముందు డైవర్స్ ఎవరు అడిగారో ఎందుకు తీసుకున్నారో తెలియదు అయితే ముందు ఇద్దరు తమ ఫ్యామిలీలో అసలు ఏమాత్రం కలవలేదని అన్నారు. అయితే పవన్ మూడవ భార్య రష్యన్ అమ్మాయే అయినా ఇండియన్ సామ్రదాయాల మీద మంచి అవగాహన ఉంది.

ఆమె మా ఫ్యామిలీలో బాగా కలిసిపోయింది. అయితే ముందు ఇద్దరు ఆడవాళ్లే కాబట్టి వారిని ఏమి కించపరచను. కాని పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడి అతన్ని పొలిటికల్ గా టార్గెట్ చేయడం మాత్రం ఏమాత్రం సమంజసం కాదని అన్నాడు నాగ బాబు. ఇక తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా తాను నిరాకరించానని.. కార్యకర్తగా తను జనసేనకు సేవలందిస్తానని అన్నారు నాగబాబు. నాగబాబు రియాక్షన్ మీద రేణు దేశాయ్, పవన్ మొదటి భార్య కళ్యాణి ఎలా స్పందిస్తారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news