Gossipsతమన్నా ఇక వాటికి సిద్ధమైందట.. అవకాశాల్లేనప్పుడు ఏం చేస్తుంది..!

తమన్నా ఇక వాటికి సిద్ధమైందట.. అవకాశాల్లేనప్పుడు ఏం చేస్తుంది..!

రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ టైంలో ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్స్ పని ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంబినేషన్స్ రిపీట్ చూసేందుకు కూడా ఇష్టపడట్లేదు. సమంత ఎలాగు అక్కినేని’; కోడలుగా మారిన తర్వాత సినిమాలను పూర్తిగా తగ్గించేసింది. ఇక వచ్చిన అవకాశాలతో కాజల్ ఈమధ్య మళ్లీ కెరియర్ స్పీడందుకోగా తమన్నా మాత్రం అరకొర అవకాశాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బాహుబలిలో నటించి ఆమె ఇలా అవకాశాలు లేకుండా ఖాళీగా ఉండటం ఆశ్చర్యకరమని చెప్పొచ్చు.

అందుకే వచ్చిన ఏ చిన్న అవకాశం వదలను అంటుంది తమన్నా.. అంతేకాదు తెలిసిన దర్శకులతో తనకు ఛాన్స్ ఉంటే ఇవ్వండి అంటూ అడుగుతుందట. సాధారణంగా స్టార్ హీరోయిన్స్ ఎవరు ఇలా అడిగినట్టు ఎప్పుడు చెప్పుకోలేదు. కాని అవకాశాల కోసం మొహమాటం లాంటివి పక్కన పెట్టేసిన తమన్నా సినిమా ఛాన్స్ ఇవ్వండి ఎలాంటి రోల్ అయినా పర్వాలేదు. అవసరమైతే గ్లామర్ డోస్ ఇంకాస్త పెంచుతా అంటుందట. క్రేజ్ ఉన్న ఈ కొద్దినాళ్లలో ఎంతోకొంత మొత్తాన్ని సంపాదించాలని ప్లాన్ చేసింది అమ్మడు.

టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటుగా యువ హీరోలతో కూడా తమన్నా నటించి మెప్పించింది. ప్రస్తుతం సైరాలో ఛాన్స్ కొట్టేసిన మిల్కీ బ్యూటీ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో మూవీలో కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఒకవేళ ఈ రెండు సినిమాలు హిట్టైతే మళ్లీ కాజల్ లానే తమన్నా కూడా బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. క్వీన్ రీమేక్ గా వస్తున్న దటీజ్ మహాలక్ష్మి కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. మరి తమన్నా కెరియర్ ఎటువైపు వెళ్తుందో ఆ సినిమాల ఫలితాలను బట్టి తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news