Gossipsచైతూ భార్యతో.. అదిరిపోయిందంటున్న స్టార్ హీరో..!

చైతూ భార్యతో.. అదిరిపోయిందంటున్న స్టార్ హీరో..!

అక్కినేని నాగ చైతన్య – సమంతల వివాహం తరువాత వీరిద్దరు మంచి సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతున్నారు. అటు సినిమాల పరంగా, ఇటు పర్సనల్ లైఫ్ పరంగా ఇద్దరూ ముందుకు సాగిపోతున్నారు. అయితే చైతూ భార్యతో అది చేయడం అదిరిపోయిందంటూ ఓ స్టార్ హీరో చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు..? సమంతతో ఆయన ఏం చేశారు? అనే విషయాన్ని తెలుసుకుందామా!

కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘మన్మథుడు 2’ చిత్ర షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై నాగ్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు స్పెషల్ రోల్స్‌ చేయనున్న సంగతి తెలిసిందే. అందులో ఒక హీరోయిన్‌ మరెవరో కాదు సమంతే. అవును.. సమంతతో నాగ్ ఈ సినిమాలో చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని.. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదిరిపోయందంటూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు నాగ్.

గతంలోనూ నాగ్, సమంత కలిసి రాజు గారి గది-2లో నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో సమంత ఎలాంటి పాత్ర చేస్తుందా అని అక్కినేని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news