Gossipsఎఫ్-3లో మరింత ఫన్.. వెంకీ, వరుణ్ లతో పాటు ఆ హీరో...

ఎఫ్-3లో మరింత ఫన్.. వెంకీ, వరుణ్ లతో పాటు ఆ హీరో కూడా..!

అనీల్ రావిపుడి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పించింది. అందుకే సినిమా వసూళ్ల హంగామా సృష్టిస్తుంది. సినిమా సక్సెస్ అవుతుందని ముందే ఊహించిన చిత్రయూనిట్ ఎఫ్-2 ఎండ్ కార్డ్ లో ఎఫ్-3 అని వేశారు. అంటే ఇదే కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందని ముందే చెప్పేశారు. అనుకున్నట్టుగానే ఎఫ్-2 సక్సెస్ మీట్ లో ఎఫ్-3 ఉంటుందని చెప్పారు.

ఎఫ్-2లో వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీ అదరగొట్టగా ఎఫ్-3లో మరో స్టార్ హీరో నటిస్తాడని తెలుస్తుంది. అతనెవరో కాదు మాస్ మహరాజ్ రవితేజ అని అంటున్నారు. ఆల్రెడీ రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా చేసిన అనీల్ రావిపుడి ఆ సినిమా సక్సెస్ అందుకున్నాడు. అందుకే ఎఫ్-3 కోసం అడగ్గానే మారు మాట మాట్లాడకుండా ఓకే అనేశాడట. ఒక హీరో ట్రిపుల్ రోల్ వేయడం వేరు.. ఒక సినిమాలో ముగ్గురు హీరోలు నటించడం వేరు. అందుకే ఎఫ్-3 మరింత కలర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

ఎఫ్-3 కూడా దిల్ రాజు బ్యానర్ లోనే వస్తుంది. కాస్ట్ అండ్ క్రూ అదే అవుతుందని తెలుస్తుంది. కాకపోతే రవితేజ అతనికో హీరోయిన్ మాత్రం యాడ్ అవుతారట. మరి ఎఫ్-2 సినిమా చూసి కడుపుబ్బా నవ్విన ఆడియెన్స్ ఎఫ్-3పై ఇంకాస్త అంచనాలు పెట్టుకోవడం కామనే మరి ఆ అంచనాలను అందుకే సినిమా అవుతుందా లేదా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news