Gossipsఇలియానాతో లిప్ లాక్ కోసం కుర్ర హీరో ఆరాటం !

ఇలియానాతో లిప్ లాక్ కోసం కుర్ర హీరో ఆరాటం !

‘పోకిరి’ హీరోయిన్ ఇలియానా స్లిమ్ బాడీతో మత్తెక్కించే అందచందాలతో అందరిని ‘దేవదాస్’లను చేసేసింది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలతో నటించి అందరిని మెప్పించింది ఈ గోవా సుందరి. అప్పట్లో అందరికంటే ఎక్కువగా కోటిరూపాయల పారితోషకం అందుకుని వార్తల్లోకి కూడా ఎక్కింది. ఇప్పుడు ఆమెకు అవకాశాలు సన్నగిల్లినా ఆమెకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

ఆమె కోసం ఇప్పటికీ కుర్ర హీరోలు లొట్టలేసుకుంటూ ఆమెతో నటించే అవకాశం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు అని చెప్పడానికి ఓ కుర్ర హీరో సాక్ష్యంగా నిలుస్తున్నాడు. ఈ మధ్యనే హాట్ హాట్ లవ్ స్టోరీతో మంచి హిట్ కొట్టిన ఓ యంగ్ హీరో తాను ఇలియానా అంటే చెవికోసుకుంటాను అంటూ ఆమెను ఎంతగా ఆరాధిస్తున్నానో చెప్పుకొచ్చాడు. అక్కడితో ఈ కుర్ర హీరో ఆగడంలేదు… ఇలియానా గురించి తన మనసులో కోరికలన్నీ చెప్పేస్తున్నాడు.

ఇంతకీ ఏంటి అంటే… తనకు ఇలియానాను ముద్దు పెట్టుకోవాలని ఉందని…ఓపెన్ గా చెప్పేస్తున్నాడు . అందులోనూ అలాంటి ఇలాంటి ముద్దు కాదట . ఏకంగా లిప్ లాక్ కిస్ కావాలని మారం చేస్తున్నాడు . దీనికి కారణం కూడా సిల్లీగా చెప్తున్నాడు. అదేంటంటే… అతడు చిన్నప్పటి నుంచి ఇలియానాను ఆరాధిస్తున్నాడట. అందుకే ఆమె తీపి జ్ఞాపకంగా ఇలా లిప్ లాక్ కిస్ కావాలని కోరుతున్నాడు. ఇంతకీ ఎవారా యంగ్ హీరో అని మీకు డౌట్ వచ్చింది కాదు … లిప్ లాక్ కిస్ లలో బాగా ఆరితేరిపోయిన ఆర్‌ ఎక్స్ 100 హీరో కార్తికేయ .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news