Gossipsఅంతరిక్షం అంతు చూసేందుకు నందమూరి ఫ్యాన్స్ సిద్ధం..తండ్రి చేసిన తప్పుకి తనయుడికి...

అంతరిక్షం అంతు చూసేందుకు నందమూరి ఫ్యాన్స్ సిద్ధం..తండ్రి చేసిన తప్పుకి తనయుడికి శిక్ష..!

తండ్రి నాగబాబు చేసిన పనికి తనయుడు వరుణ్ తేజ్ శిక్ష అనుభవించబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి నందమూరి అభిమాన వర్గాలు. బాలకృష్ణ ఎవరో తెలియదు అని చెప్పకపోతేనే సగం హర్ట్ అయిన నందమూరి ఫ్యాన్స్ ఆయనెవరో వళ్లూరి బాలకృష్ణ తెలుసని ఆయనో గొప్ప కమెడియన్ అని చెప్పి అవహేళన చేశాడు నాగబాబు. దీనిపై నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ వేరేలా ఉంది. నాగబాబు మీద ఇప్పటికే నెగటివ్ ట్రోల్స్ చేస్తుండగా.. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మీద కూడా నందమూరి ఫ్యాన్స్ కక్ష్య కట్టినట్టు తెలుస్తుంది.

అందులో భాగంగా డిసెంబర్ 21న రిలీజ్ అవబోతున్న అంతరిక్షం మూవీని అడ్డుపడేందుకు ప్లాన్ చేస్తున్నారట. సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న అంతరిక్షం మూవీ స్పేస్ కాన్సెప్ట్ తో అద్భుతమైన విజువల్ వండర్ గా రాబోతుంది. ఈమధ్య వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. టాలీవుడ్ ప్రతిష్టతను మరింత పెంచేలా ఈ సినిమా ఉంటుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగా నందమూరి సినిమా వార్ కాస్త పొలిటికల్ వార్ గా మారడం కామన్ మెన్ కు కాస్త ఇబ్బందికరంగా ఉంది.

పొలిటికల్ గా ఎవరేమనుకున్నా ఓకే కాని అది సినిమా పరిశ్రమ వరకు రాకుండా ఉంటే బెటర్ అని సగటు సిని ప్రేక్షకుడి ఆలోచన. అయితే నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ ఇంతవరకు రియాక్ట్ అయ్యింది లేదు. ఆయన రియాక్షన్ ను బట్టి ఫ్యాన్స్ తమ తదుపరి కార్యచరణలు చేయనున్నారట. అంతరిక్షం నిర్మాతగా క్రిష్ ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ డైరెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారా నందమూరి ఫ్యాన్స్ ఆవేశాన్ని కంట్రోల్ చేసేందుకు బాలయ్యతో ఓ మెసేజ్ ఇప్పిస్తాడని అంటున్నారు. అంతరిక్షం అనుకున్నట్టుగా రిలీజ్ అవుతిందా మెగా నందమూరి ఫ్యాన్ ఫైట్ ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకమే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news