Gossipsఆనందంలో తాప్సీ వాటా ఎంత..?

ఆనందంలో తాప్సీ వాటా ఎంత..?

తాప్సీ ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ లు నటించిన సినిమా ఆనందో బ్రహ్మ. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ లో తాప్సీ ఉత్సాహం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కచ్చితంగా తాప్సీ సినిమాలో ఎక్కువ స్క్రీన్ షేర్ చేసుకుని ఉండొచ్చని అనుకున్నారు.

తీరా ఈరోజు సినిమా చూస్తేనే కాని తెలిసింది.. ఆమెది చిన్న రోల్ మాత్రమే అని.. మరి ఈ చిన్న రోల్ కు ఎందుకు తాప్సీ అంత ఎక్సైటింగ్ గా ప్రమోషన్స్ చేసింది అంటే ఇక్కడ మరో రీజన్ ఉందని అంటున్నారు సిని జనాలు. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో వచ్చిన ఆనందో బ్రహ్మ సినిమాలో తాప్సీకి కూడా షేర్ ఉందని తెలుస్తుంది.

నైజాం దిల్ రాజు, కొన్ని ఏరియాల్లో యువి క్రియేషన్స్ వారు ఈ సినిమా రిలీజ్ చేశారు. సీడెడ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణా రైట్స్ లలో కచ్చితంగా తాప్సీ ఒక ఏరియా తీసుకుని ఉంటుందని అంటున్నారు. మొత్తానికి తెలుగు సినిమాలకు దూరమైన తాప్సీ ఓ మంచి ప్రయత్నంతో ముందుకొచ్చింది. మరి ఈ సినిమా తాప్సీ టాలీవుడ్ కెరియర్ కు ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news