Gossipsబోయపాటికి దారుణమైన షాక్ ఇచ్చిన మహేష్ బాబు ..!

బోయపాటికి దారుణమైన షాక్ ఇచ్చిన మహేష్ బాబు ..!

తనతో ఉన్న స్టార్స్ ఓ పక్క ఇండస్ట్రీ హిట్లు కొడుతున్న ఈ సందర్భంలో సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల ఫ్లాప్ తో వెనక పడ్డాడు. ఇక ప్రస్తుతం శ్రీమంతుడు కాంబినేషన్ లో కొరటాల శివతో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు మహేష్. సినిమాలో మహేష్ సిఎంగా కనిపించనున్నాడు.

అనుకోని విధంగా ఫ్లాపులు పలుకరించడంతో సినిమా కథల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడట. ఈ క్రమంలో మాస్ అండ్ కమర్షియల్ డైరక్టర్ బోయపాటి శ్రీను చెప్పిన కథ రొటీన్ గా అనిపించడంతో మహేష్ సారీ అని చెప్పాడట. బోయపాటి కథలు ఒకేలా ఉన్నా హీరోల క్యారక్టరైజేషన్ వేరేలా ఉంటుంది. బోయపాటి చెప్పిన లైన్ నచ్చలేదని ఆయనకు షాక్ ఇచ్చాడట.

వేరే కథ ఏదైనా ఉంటే తీసుకు రమ్మని చెప్పాడట. అయితే ముందు చెప్పిన లైన్ డెవలప్ మెంట్ కూడా అవసరం లేదని అన్నాడట. మరి బోయపాటి కథ మార్చుకుని మహేష్ దగ్గరకు వెళ్తాడా లేక ప్రయత్నం విరమించుకుంటాడా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news