Moviesవరల్డ్ సెకండ్ ప్లేస్ లో విజన్ ఆఫ్ భరత్.. మహేష్ స్టామినాకు...

వరల్డ్ సెకండ్ ప్లేస్ లో విజన్ ఆఫ్ భరత్.. మహేష్ స్టామినాకు నిదర్శనం ఇదే..!

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమా టీజర్ తో సంచలనాలు సృష్టిస్తుంది. విజన్ ఆఫ్ భరత్ అంటూ టీజర్ తో వచ్చిన మహేష్ సినిమా వరల్డ్ టాప్ టీజర్ వ్యూయర్స్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. విజన్ ఆఫ్ భరత్ మొత్తంగా 14 మిలియన్ల వ్యూయర్ కౌంట్ సాధించింది. 1.60 లక్షల లైకులు కూడా సాధించింది.

వరల్డ్ సినిమాల్లో ఇదే అత్యుత్తం కావడం విశేషం. ఇక టాప్ ప్లేస్ లో కూడా మన ఇండియన్ మూవీనే ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ టీజర్ ఏకంగా 38 మిలియన్ వ్యూస్ సాధించింది. దాదాపు 10 లక్షల దాకా లైకులు వచ్చాయి. ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ మెర్సల్ పేరు మీద ఉండగా ఆ తర్వాత స్థానం అంటే సెకండ్ ప్లేస్ లో మహేష్ భరత్ అనే నేను ఉంది.

ఇక టీజర్ తో అంచనాలు పెంచేసిన భరత్ అనే నేను సినిమా కచ్చితంగా మహేష్ కు అదిరిపోయే హిట్ అందిస్తుందని అంటున్నారు. సినిమాలో మహేష్ సిఎంగా నటిస్తుండగా సొసైటీకి కచ్చితంగా మంచి సినిమా అందిస్తారని తెలుస్తుంది. మరి సినిమా ఫలితం ఏంటన్నది ఏప్రిల్ 20న తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news