Gossipsచిరుపై సుకుమార్ పొలిటికల్ పొగ

చిరుపై సుకుమార్ పొలిటికల్ పొగ

రాం చరణ్, సుకుమార్ కాంబోలో క్రేజీ మూవీగా వస్తున్న సినిమా రంగస్థలం. ఈ నెల 30 రిలీజ్ షురూ చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉగాది సందర్భంగా నిన్న వైజాగ్ లో జరిగింది. సినిమా అంచనాలు పెంచేసిన టీజర్, సాంగ్స్ తో పాటుగా కొత్తగా ట్రైలర్ కూడా మరింత హైప్ క్రియేట్ చేసింది. కచ్చితంగా ఈ సినిమా చరణ్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయ్యారు. ఈవెంట్ లో భాగంగా డైరక్టర్ సుకుమార్ మాట్లాడుతూ చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అభిమాన నటుడు చిరంజీవి అని చెప్పిన సుక్కు.. ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి.. అంటూ చిరంజీవి పాలిటిక్స్ లో వస్తున్నప్పుడు తను, దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడిన డిస్కషన్ ను వెళ్లడించాడు.

చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే సందర్భంలో.. ఆయనకు సిఎం పోస్ట్ కన్నా చిరంజీవి పోస్ట్ పెద్దది కదా మరి ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారని మాట్లాడుకున్నామని అన్నాడు సుకుమార్. నిజంగానే సిఎం సీటు కన్నా గొప్పదా కాదా తెలియదు కాని ఐదేళ్ల కొకసారి మారే ముఖ్యమంత్రి కన్నా చిరంజీవి మాత్రం ఒక్కడే అంటూ సుకుమార్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓ రకంగా చిరంజీవి మీద ఉన్న అభిమానం ఇలా చెప్పాడని మెగా ఫ్యాన్స్ సుకుమార్ స్పీచ్ ను హైలెట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news