Movies ‘శివలింగ’ టీజర్ టాక్ : మరో హార్రర్ కంటెంట్‌తో ఆకట్టుకున్న...

‘శివలింగ’ టీజర్ టాక్ : మరో హార్రర్ కంటెంట్‌తో ఆకట్టుకున్న లారెన్స్

Raghava Lawrence latest movie Shiva Linga teaser has released which is very impressive. In this video Lawrence looks very handsome never before.

హారర్ సినిమాలకు ఎప్పటినుంచో మంచి గిరాకీ ఉంది. అందుకే.. ఇప్పటికీ దర్శకనిర్మాతలు ఆ జోనర్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక రాఘవ లారెన్స్ అయితే ఈ జోనర్‌నే పట్టుకుని వేలాడుతున్నాడు. తన కెరీర్‌ని అనూహ్య మలుపు తిప్పడంతోపాటు వరుస విజయాలు అందిస్తుండడంతో.. ఆ తరహా సినిమాలే చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ‘శివలింగ’ అనే మరో హారర్ మూవీ చేస్తున్నాడు లారెన్స్. ఈమధ్యే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా యూనిట్ టీజర్‌ని రిలీజ్ చేసింది. అదెలాగుందో చూద్దాం పదండి…

ఓ యాక్షన్ సీన్‌తో స్టార్ట్ అయ్యే ఈ టీజర్.. ఎన్నో ట్విస్టులతో కూడి ఉంది. ముఖ్యంగా.. పావురాన్నే హైలైట్ చేస్తూ చూపించడాన్ని చూస్తే, అందులోనే దెయ్యం ఉందా? అనే సందేహం కలగక మానదు. మధ్యలో కొన్ని షాట్స్ అయితే హాలీవుడ్‌ని తలపించేలా ఉన్నాయి. ముఖ్యంగా.. ట్రెయిన్ సన్నివేశం, ఆ తర్వాత ఓ ఇంటివద్దనున్న స్విమ్మింగ్‌పూల్‌లో అలలు స్పీడుగా వెళుతున్నట్లు చూపించిన విధానం సూపర్బ్. ఆ విజువల్స్ ఔరా అనిపించేలా ఉన్నాయి. కామెడీ కూడా బాగానే ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ తరహా సినిమాల్లో ట్విస్టులు ఉండడం కామన్ కాబట్టి.. ఇందులోనూ అంతకుమించే ఉన్నాయని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఇక ఇందులో లారెన్స్ గతంలో మునుపెన్నడూ లేని విధంగా చాలా హ్యాండ్సమ్‌గా కనువిందు చేశాడు. ప్రతి షాట్‌లోనూ అతని లుక్ కేక. హీరోయిన్ రితిక సింగ్ కూడా రెండుమూడు చోట్ల బాగానే మెరిసింది. చీరకట్టులో అందంగా ఆమె ఇచ్చిన ఎంట్రీ, మరోచోట భయపడుతూ ఆమె పలికిన హావభావాలు ఆకట్టుకున్నాయి. విజువల్‌గా, కంటెంట్ పరంగా టీజర్ అదిరింది.

ఇక టెక్నికల్ పరంగా చూస్తే.. పి.వాసు మేకింగ్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ప్రతి సీన్‌ని చాలా హైలైట్‌గా తెరకెక్కించాడు. సినిమాటోగ్రఫీకి కూడా ఫుల్ మార్కులు వేసేయొచ్చు. ప్రతి ఫ్రేమ్‌ని గ్రాండ్‌గా, కళ్లుచెదిరేలా ఉన్నాయి. ఈ టీజర్‌ని ఎడిట్ చేసిన కూడా బాగుంది. ఎక్కడా స్టోరీలైన్ రివీల్ అవ్వలేదు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ‘శివలింగ’ సాంగ్ అదిరిపోయింది. ఒక్కసారి వింటే.. మళ్ళీ మళ్లీ వినాలపించేలా ఉంది. ఓవరాల్‌గా చూస్తే.. ఈసారి కూడా రాఘవ లారెన్స్ హిట్ కొట్టబోతున్నాడని చెప్పుకోవచ్చు.

https://youtu.be/Ovh48wqYS80

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news