Gossipsషాలినీ కి ముద్దులపై మోజు తగ్గలేదా ..?

షాలినీ కి ముద్దులపై మోజు తగ్గలేదా ..?

టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ సినిమా దెబ్బకి ఇందులో హీరో హీరోయిన్ గా నటించిన విజయ్ దేవర కొండా , షాలిని పాండే పెద్ద స్టార్స్ రేంజ్ కి వెళ్లిపోయారు.

ఈ సినిమాలో నటించిన హీరోయిన్ షాలినీ పాండే కి అయితే తన మొదటి సినిమాతోనే యూత్ మనసు దోచుకుంది. ఈ సినిమాలోని ముద్దు సీన్స్‌లో ఆమె చూపిన అభినయానికి ప్రేక్షక లోకం దాసోహం అయిపోయింది. దీంతో యువతరం అంతా షాలినీ పాండేకు అంటే పిచ్చెక్కిపోతున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈ అమ్మడు నిజ జీవితంలో కూడా తనకు ముద్దులంటే ఎంత క్రేజో చెప్పకనే చెప్పేస్తోంది.

తాజాగా ఓ బాలుడు తనకు ముద్దులు పెడుతున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా అందరితోనూ పంచుకుంది ఈ అర్జున్ రెడ్డి హీరోయిన్ . అయితే ఈ వీడియోలో ఆ బాలుడు ముద్దులు పెడుతుండగా నవ్వుతూ తెగ సంబురపడుతూ షాలిని కనిపిస్తోంది. కాగా ఈమె ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న ‘మహానటి’ సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మర్చి 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అందులో మాత్రం ఈ ముద్దుగుమ్మ ఎన్నిముద్దు సీన్లలో నటిస్తుందో ఏమో అని కుర్రకారు వెయిటింగ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news