Specialsసమంత కొత్త వ్యాపారం..ఈ సారి ఏమి చేస్తుందో..?

సమంత కొత్త వ్యాపారం..ఈ సారి ఏమి చేస్తుందో..?

కోలీవుడ్‌, టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన సమంత తాజాగా ఓ కొత్త వ్యాపారం ప్రారంభించింది. ఎస్‌వీఎస్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పీ పేరిట తాను సొంత వ్యాపారం ప్రారంభించాను అంటూ సమంతే స్వయంగా ప్రకటించింది. ట్విటర్‌లో సమంత చేసిన ఈ ప్రకటనకి భారీ స్పందన కనిపించింది. సమంతకి ఆమె అభిమానులు, పరిశ్రమ మిత్రుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.

ఇటీవల కాలంలో చేనేత కార్మికులకి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్న సమంత ఇప్పుడు కొత్తగా స్థాపించిన ఈ వ్యాపారం కూడా అందుకు సంబంధించినదే అయ్యుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ సమంత స్టార్ట్ చేసిన వ్యాపారం ఏ ఉత్పత్తులు, సేవలకి సంబంధించినదో కూడా ఓ క్లారిటీ వస్తే ఓ పనైపోతుందంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇప్పటివరకు హీరోయిన్‌గా, సామాజిక సేవకురాలిగానే బిజీగా వున్న సమంత ఇకపై బిజినెస్ ఉమన్‌గానూ బిజీ కానుందన్నమాట!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news