Gossipsస్టార్ హీరోకు చుక్కలు చూపించిన సాయి పల్లవి..!

స్టార్ హీరోకు చుక్కలు చూపించిన సాయి పల్లవి..!

మలయాళ ప్రేమంతో హిట్ అందుకోవడమే కాదు తెలుగులో ఫిదాతో సత్తా చాటిన భామ సాయి పల్లవి ఇప్పుడు తెలుగులో క్రేజీ బ్యూటీగా మారింది. తన అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సాయి పల్లవి వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో సినిమా ఆఫర్ కూడా ఆమెకు వచ్చిందట.

కాని అమ్మడు మాత్రం ఆ స్టార్ సినిమాను చేయనని చెప్పేసిందట. కారణాలు ఏంటి అన్నది తెలియదు కాని సాయి పల్లవి నో చెప్పడంతో ఆ స్టార్ హీరో షాక్ కు గురయ్యాడట. తెలుగులో ఒక సినిమానే చేసినా సరే సాయి పల్లవికి మాత్రం ఊహించని క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం నానితో ఎం.సి.ఏ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి ఆ తర్వాత నాగ శౌర్య సినిమాలో కూడా నటిస్తుండటం విశేషం.

తెలుగులో ఒక సినిమాతోనే స్టార్ ఆఫర్ అందుకోవడం గొప్ప విషయమే కాగా అమ్మడు వచ్చిన అవకాశాన్ని సైతం కాదనడం షాకింగ్ గా మారింది. మరి సాయి పల్లవి ఈ నిర్ణయానికి గల కారణాలేంటో కాని ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news