బాలయ్య ఫ్యాన్స్‌కి భారీ షాకింగ్ న్యూస్.. ‘శాతకర్ణి’ విడుదలకు కష్టాలు ?

sai korrapati dropped gautamiputra satakarni ceded vizag rights deal

Sai Korrapati took backstep in Satakarni Ceded and Vizag theatrical rights deal. This is really shocking news for unit and fans also.

బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు షాకింగ్ న్యూస్. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా తాజాగా ఓ చిక్కులో పడింది. ఓ బడా నిర్మాత చివరి నిముషంలో హ్యాండ్ ఇవ్వడంతో.. ఆ సమస్య ఎదురైంది.

అసలు మేటర్ ఏమిటంటే.. శాతకర్ణి సినిమా సీడెడ్ రైట్స్‌తోపాటు వైజాగ్ హక్కుల్ని తీసుకుంటానని ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ముందుకు వచ్చాడు. అంతేకాదు.. బాలయ్య మార్కెట్‌కి మించి భారీ అమౌంట్‌ని ఆఫర్ చేశాడు. దీంతో.. ఈ మూవీ యూనిట్ ఇతర డిస్ట్రిబ్యూటర్లను పక్కకునెట్టేసి, సాయితో డీల్ కుదుర్చుకుంది. ఈ మూవీ విడుదల అయ్యేలోపు మొత్తం డబ్బులు అరేంజ్ చేస్తానని మాటివ్వడంతో.. చిత్రబృందం సీడెడ్, వైజాగ్ హక్కుల్ని అతని చేతిలో పెట్టింది. అయితే.. ఇప్పుడు ఆ డీల్ నుంచి సాయి మిడిల్ డ్రాప్ అయ్యాడని సమాచారం.

సడెన్‌గా అతను ఈ డీల్ నుంచి డ్రాప్ అవ్వడానికి కారణం.. పెద్ద నోట్ల రద్దు ప్రభావమేనని తెలిసింది. డీమోనిటైజేషన్ కారణంగా సాయి కరెన్సీ కష్టాల్లో పడ్డాడు. ఆ దెబ్బకు ఇంతవరకు డీల్ కుదుర్చుకున్న అమౌంట్‌ని ఏర్పాటు చేయలేకపోయాడట. అందుకే.. హఠాత్తుగా డీల్ నుంచి డ్రాప్ అయ్యాడట. ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గ్రహించి.. ఈ డీల్ నుంచి తాను డ్రాప్ అవుతున్నట్లు నేరుగా బాలయ్యతోపాటు టీంకి చెప్పాడట.

దీంతో.. సాయి కొర్రపాటి ఆఫర్ చేసిన అమౌంట్‌కి ఆ ఏరియాల హక్కుల్ని ఇతర డిస్ట్రిబ్యూటర్లకు అమ్మాలని యూనిట్ ప్రయత్నిస్తోందట. ఒకవేళ ఈ మూవీ రైట్స్‌ని తీసుకోవడానికి ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాకపోతే.. నేరుగా నిర్మాతలు విడుదల చేయాల్సి ఉంటుంది. మరి.. ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మాతలు విడుదల చేస్తారా? లేదా రిలీజ్‌లోపు ఏ డిస్ట్రిబ్యూటర్‌కైనా తీసుకుంటాడా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

More from my site