Videosవామ్మో... చరణ్ సినిమాల్లో ఎంట్రీకి ముందే శ్రీయాతో రొమాన్స్..! (వీడియో)

వామ్మో… చరణ్ సినిమాల్లో ఎంట్రీకి ముందే శ్రీయాతో రొమాన్స్..! (వీడియో)

మెగా పవర్ స్టార్ రాం చరణ్ చిరుత సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఇక ఆ తర్వాత చరణ్ సినిమాలు హిట్లు ఫ్లాపులు అన్ని తెలిసిందే. ఈ క్రమంలో చరణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే హీరోయిన్ శ్రీయతో రొమాన్స్ చేశాడు. అది ఎలాగా అంటే రాం చరణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ముంబైలోని యాక్టింగ్ ఇన్స్ ట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు.

చరణ్ అక్కడ క్లాసులు నేర్చుకుంటున్న సమయంలో అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న శ్రీయ గెస్ట్ గా వచ్చిందట. అప్పుడే చరణ్ శ్రీయల మధ్య ఓ సీన్ షూట్ చేశారట. ప్రస్తుతం ఆ 4 మినిట్స్ సీన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. శ్రీయ అప్పటికే హీరోయిన్ కాబట్టి చలాకీగా కనిపిస్తున్నా చరణ్ మాత్రం కాస్త తడబడుతూ కనిపించాడు.

ఆ వీడియో ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందో ఏమో కాని చరణ్ యాక్టింగ్ చిరుత కన్నా ముందు శ్రీయతో కలిసి అదరగొట్టాడన్నమాట. సీన్ చిన్నదే అయినా చరణ్ అందులో నటించాలానే తపన మంచిగా కనిపిస్తుంది. అందుకే మెగా అభిమానుల హృదయాల్లో చరణ్ మెగా పవర్ స్టార్ గా నిలిచాడు. సడెన్ గా ఈ వీడియో యూట్యూబ్ లో చూసి మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే చిరు, పవన్ లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీయా ఇప్పటిదాకా చరణ్ తో మాత్రం నటించలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news