Gossipsఆ రికార్డు వద్ద చతికిలపడ్డ చిట్టి బాబు

ఆ రికార్డు వద్ద చతికిలపడ్డ చిట్టి బాబు

రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా వస్తున్న రంగస్థలం సినిమా ఈ నెల చివరన వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఉగాది రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. సుకుమార్ డైరక్షన్, చరణ్ యాక్టింగ్ టాలెంట్ ఈ రెండు సినిమాకు హైలెట్ అంశాలుగా ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. అయితే స్టార్ హీరో సినిమా ట్రైలర్ అంటే కచ్చితంగా రికార్డులు సృష్టించాల్సిందే.

కాని రంగస్థలం ట్రైలర్ 24 గంటల్లో కేవలం 4.8 మిలియన్స్ మాత్రమే వ్యూయర్ కౌంట్ సాధించగలిగింది. ఇంకా చెప్పాలంటే రంగస్థలం టీజరే ఎక్కువ వ్యూయర్ కౌంట్ తెచ్చుకుంది. ఇక లైకుల విషయంలో 1 లక్షా 60 వేల లైకులను తెచ్చుకుంది. అయితే ట్రైలర్ రిలీజ్ నాడు ఇండియా బంగ్లాదేష్ మ్యాచ్ ఉండటంతో సిని ప్రియులు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదని అంటున్నారు.

ఏది ఏమైనా సరే చరణ్ పూర్తి మేకోవర్ తో నట విశ్వరూపం చూపించబోతున్న ఈ రంగస్థలం సినిమా ట్రైలర్ ఎందుకు టార్గెట్ రీచ్ అవలేకపోయిందో తెలియాల్సి ఉంది. మరి సినిమాపై ఈ ప్రభావం ఏమి లేకుండా రికార్డులు రచ్చ చేయాలని ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news