Newsరామ్ చరణ్ - సుకుమార్ కలిసి చేసిన తప్పు ఇదే... ఇద్దరూ...

రామ్ చరణ్ – సుకుమార్ కలిసి చేసిన తప్పు ఇదే… ఇద్దరూ ఇద్దరే

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే తీయాలని లొకేషన్లతో సహా ముందే ఫిక్స్‌ చేసేసుకున్నారు. కానీ ఏప్రిల్‌లో ఎండలు వాచిపోవడంతో మొదటి షెడ్యూల్‌ పూర్తి చేయకుండా వచ్చేసి, రెండవ షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా కాన్సిల్‌ చేసేసారు. ఒక షెడ్యూల్‌ మిస్‌ అయ్యే సరికి ఆర్టిస్టుల కాల్షీట్ల పరంగా చాలా ఇబ్బందులొస్తాయి. అందులోను బాగా బిజీగా వుండే ఆర్టిస్టులందరినీ ఇందులో పెట్టుకున్నారు. ప్రస్తుతం హీరోయిన్‌ సమంత కూడా అరడజను సినిమాలతో బిజీగా వుంది.

దీంతో దసరాకి విడుదల చేయాలని చూస్తే కంగారైపోతుందని, ఆ తర్వాత మళ్లీ మంచి సీజన్‌ లేదని ఏకంగా సంక్రాంతికి వెళ్లిపోయారు. దీంతో ప్రతి సినిమాకీ డిలే చేసే సుకుమార్‌ని కొందరు నిందిస్తున్నారు. అయితే షూటింగ్‌ మొదలు పెట్టడానికే నానుస్తూ వచ్చిన చరణ్‌ సంగతేంటని ఇంకొందరు పాయింట్‌ అవుట్‌ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news