Gossipsచరణ్ కొత్త సినిమా కి రేటు చూస్తే దీనెమ్మ జీవితం...

చరణ్ కొత్త సినిమా కి రేటు చూస్తే దీనెమ్మ జీవితం .. దిమ్మ తిరిగిపోతుంది !!

రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా తెరకెక్కుతుందని తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రికార్డులు సృష్టిస్తుంది. బోయపాటి సినిమాలకు ఉత్తరాదిన బాగా డిమాండ్ ఏర్పడింది. సరైనోడు సినిమా యూట్యూబ్ లోనే సంచలనం సృష్టించింది.

అందుకే ఈ కాంబోలో వస్తున్న సినిమా హింది డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ కలిపి 22 కోట్లకు కొనేశారట. ధ్రువ తర్వాత రేంజ్ పెంచుకున్న చరణ్ బోయపాటి శ్రీను సినిమా బిజినెస్ దానికి తగినట్టుగానే రాబడుతున్నాడు. ప్రస్తుతం రంగస్థలం మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 30న రిలీజ్ అవుతుంది.

సెట్స్ మీద ఉన్నప్పుడే రికార్డులు సృష్టిస్తున్న బోయపాటి సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా టైటిల్ గా జిల్ జిల్ జిగేల్ అని పెట్టబోతున్నారట. సినిమా టైటిల్ కూడా క్రేజీగా ఉండటంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెట్టుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news