Gossipsమహేష్‌బాబుతో రాజమౌళి సినిమా.. రూమర్ కాదు.. అక్షరాల నిజం!

మహేష్‌బాబుతో రాజమౌళి సినిమా.. రూమర్ కాదు.. అక్షరాల నిజం!

‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తాడా? అని ఇండస్ట్రీలో ఒకటే చర్చ. దీనిపై జక్కన్న ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ.. వచ్చే ఏడాదిలో ప్రిన్స్ మహేష్‌బాబుతో ఓ సినిమా తీయడం గ్యారెంటీ అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఉన్నట్లుండి ఈ న్యూస్ బయటికి రావడానికి ఒక బలమైన కారణం కూడా వుంది. పదండి.. ఆ వివరాలేంటో మేటర్‌లోకి వెళ్ళి తెలుసుకుందాం..

‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలయ్యే ముందు రాజమౌళి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్‌తో సినిమాకి కమిట్మెంట్ ఉందని చెప్పాడు. త్వరలోనే తమ కాంబోలో ఓ మూవీ వుంటుందని ప్రకటించాడు. దీంతో.. ‘బాహుబలి-2’ తర్వాత వీరి కాంబో సెట్ అయ్యే ఛాన్స్ వుంటుందని అంతా భావించారు. కానీ.. ‘బాహుబలి’ రిలీజైనా జక్కన్న ఆ సినిమా ఊసే ఎత్తకపోవడం, మహేష్ వరుసగా సినిమాల్ని లైన్‌లో పెట్టడంతో.. వారి కాంబో ఇప్పుడిప్పుడే సెట్ కాకపోవచ్చునని భావించారు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాదిలోనే వీరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని తెలిసింది.

గతంలో సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణకు జక్కన్న ఓ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు వచ్చే ఏడాదిలో ఆయనతో సినిమా చేస్తానని జక్కన్న మరోసారి కలిసి మాటిచ్చాడు. ఈ సినిమా మహేష్‌తో చేయాలని నారాయణ కోరిక. ఇందుకు మహేష్ కూడా సుముఖంగానే వున్నాడు. ఈ రకంగా జక్కన్న-మహేష్ కాంబో కుదరనుందని సినీవర్గాల పక్కా సమాచారం. మొత్తానికి.. ఎప్పటినుంచో సినీజనాలు కోరుకుంటున్న వీరి కాంబో వచ్చే ఏడాదిలో కలవనుందన్నమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news