Reviewsరానా దగ్గుబాటి , ఆర్య ల "రాజరథం" సినిమా రివ్యూ

రానా దగ్గుబాటి , ఆర్య ల “రాజరథం” సినిమా రివ్యూ

నిరూప్ బండారి, అవంతిక శెట్టి లీడ్ రోల్ లో తెలుగు, కన్నడ భాషల్లో బైలింగ్వల్ మూవీగా వచ్చిన సినిమా రాజరథం. ఆర్య ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగా రానా వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియెన్స్ ను ఎలా ఎంటర్టైన్ చేసిందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఇంజినీరింగ్ చదివే అభి (నిరూప్ బండారి) నాలుగేళ్లుగా మేఘ శ్రీధర్ (అవంతిక శెట్టి)ని ప్రేమిస్తుంటాడు. కాని ఆమెకు చెప్పే ధైర్యం చేయడు. కోర్స్ పూర్తి చేసి బెంగళూరు వెళ్లే టైంలో మేఘా కూడా అభి బస్ లోనే ప్రయాణం చేస్తుంది. అక్కడ వారికి యూత్ లీడర్ విశ్వ (ఆర్య) పరిచయం అవుతాడు. ఇంతకీ అభి, మేఘాలు ప్రేమ ఫలించిందా..? వారి ప్రేమకు విశ్వకు సంబంధం ఏంటి..? కథలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

బండారి బ్రదర్స్ తెరకెక్కించిన ఈ రాజరథం మూవీలో అభి పాత్రలో నిరూప్ బండారి పర్వాలేదు అనిపించుకున్నాడు. హీరోగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్ అవంతిక శెట్టి కూడా బాగా ఆకట్టుకుంది. ఆర్య ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. రానా వాయిస్ ఓవర్ కూడా సినిమాకు హెల్ప్ అయ్యింది. వినయ్ ప్రసాద్, రవిశంకర్ లు కూడా బాగానే చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :

ఓ మంచి కథ అది కూడా కొత్త తరహాలో అనుకున్న దర్శకుడు అనూప్ బండారి సినిమా ఎక్స్ క్యూట్ చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ బండారి మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ ఇంప్రెసివ్ గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

విశ్లేషణ :

బస్సులో కథ నడిపించాలన్నా ఆలోచన కొత్తగా ఉంటుంది. అంతేకాదు హీరో, హీరోయిన్ ల ప్రేమకు బస్సులో ఉన్న ప్రతి పాత్రకు కనెక్టివిటీ పెట్టడం బాగా అనిపిస్తుంది. అయితే పాత్రల పరిచయానికి మొదటి భాగం తీసుకోగా సెకండ్ హాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. ఏమాత్రం ఆకట్టుకోని కథనం తో ప్రేక్షకులు విసుగు పెట్టించేస్తారు.

సినిమా కథగా బాగా రాసుకున్నా దర్శకుడు దాన్ని తెర మీద అంతే అందంగా చూపించడంలో విఫలమయ్యాడు. ఇక సినిమాలో ఆర్య ఉన్నాడు కాబట్టి కాస్త వర్క్ అవుట్ అయ్యింది. రానా వాయిస్ ఓవర్ ఓకే అయితే అనుకున్న రేంజ్ లో మాత్రం రాలేదు. సినిమా సాగదీసినా అనుకున్నంత ఎంటర్టైన్మెంట్ కూడా కలిగించదు.

సినిమా చూస్తున్నంత సేపు సోదిగా అనిపిస్తుంది. కన్నడలో ఎలా ఉన్నా తెలుగు ప్రేక్షకులను అలరించాలంటే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాల్సింది. కథ కథనాలేవి ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేవిలా ఉండవు.

ప్లస్ పాయింట్స్ :

ఆర్య

నిరూప్ బండారి

కథ

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

సెకండ్ హాఫ్

బాటం లైన్ :

రాజరథం.. అనుకున్న రేంజ్ లో రథం నడవలేదు..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news