Gossipsబాహుబలి తో సమానంగా పవన్ కళ్యాణ్

బాహుబలి తో సమానంగా పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా చాటుకున్నారు. పవన్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీడెడ్ లో అత్యధికంగా 16.20 కోట్లకు అమ్ముడయ్యిందట. అక్కడ ఈ రేంజ్ లో బాహుబలి లాంటి సినిమా సేల్ అయ్యింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే పవన్ సినిమా ఇంతవరకు సీడెడ్ లో 12 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు.

మరి ఏ నమ్మకంతో 16.20 కోట్లతో ఈ సినిమాకు పెడుతున్నారో తెలియదు కాని సీడెడ్ లో పవర్ స్టార్ రికార్డ్ ప్రస్తుతం సంచనలంగా మారింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సీడెడ్ లోనే కాదు నైజాంలో కూడా ఈ సినిమా 29 కోట్లకు దిల్ రాజు కొనేయడం జరిగింది. ఈసారి పవర్ స్టార్ మాత్రం నాన్ బాహుబలి రికార్డులన్నిటిని బ్రేక్ చేయడం పక్కా అని తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా 2018 జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కలక్షన్స్ తో పవర్ స్టార్ స్టామినా ప్రూవ్ చేస్తుందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news