Gossipsఆఫీసర్ కి చెక్ పెట్టిన నేలటికెట్ ...!

ఆఫీసర్ కి చెక్ పెట్టిన నేలటికెట్ …!

కింగ్ నాగార్జున సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న ఆఫీసర్ సినిమా మే 25న రిలీజ్ ఫిక్స్ చేశారు. శివ కాంబినేషన్ కాబట్టి పాతికేళ్ల క్రితం సృష్టించిన సంచలనాలు రిపీట్ అయ్యేలా ఈ సినిమా ఉండాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు అనుకున్నంత బజ్ ఏర్పడలేదు. నాగ్ సినిమా అన్న ఒక్క రీజన్ తప్ప అసలు ఏమాత్రం ఫాం లో లేని వర్మ ఆఫీసర్ ఎలా తీస్తాడో అని డౌట్ పడుతున్నారు.

అయితే ఇక ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా మాస్ రాజ రవితేజ నేల టికెట్ సినిమా వస్తుంది. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కూడా మే 25న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆఫీసర్ వర్సెస్ నేల టికెట్ రెండిటిలో చెప్పాలంటే రవితేజ సినిమాకే ఎక్కువ క్రేజ్ ఏర్పడింది. మరి ఈ రెండు సినిమాల్లో ప్రేక్షకులు ఎవరికి హిట్ అందేలా చేస్తారో చూడాలి.

ఈ రెండిటితో పాటుగా కళ్యాణ్ నా నువ్వే సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అప్పుడు పోటీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. జయేంద్ర డైరెక్ట్ చేస్తున్న కళ్యాణ్ రాం నా నువ్వే క్యూట్ లవ్ స్టోరీగా రాబోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news