Gossipsఅరవింద సమేత రాఘవ.. ఎన్టీఆర్ టైటిల్ ఇదే..!

అరవింద సమేత రాఘవ.. ఎన్టీఆర్ టైటిల్ ఇదే..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం క్రేకీ కాంబినేషన్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమాకు టైటిల్ ఈరోజు సాయంత్రం రివీల్ చేస్తారని ఎనౌన్స్ చేశారు. కాని ఇప్పటికే ఈ సినిమా టైటిల్ రివీల్ అయ్యింది. నిన్న మొన్నటిదాకా అసమాన్యుడు టైటిల్ వినపడగా అది ఫైనల్ కాదని తెలుస్తుంది.

ఇక లేటెస్ట్ గా సినిమా టైటిల్ గా అరవింద సామెత రాఘవగా ఎన్.టి.ఆర్ రాబోతున్నాడు. సినిమా టైటిల్ తో మళ్లీ త్రివిక్రం తన మార్క్ చూపించాడని చెప్పొచ్చు. అజ్ఞాతవాసి కాస్త వెనక్కు నెట్టినా కాస్త గ్యాప్ ఇచ్చి తన సత్తా చాటేలా తారక్ సినిమా చేస్తున్నాడు త్రివిక్రం శ్రీనివాస్. సినిమాలో పూజా హెగ్దె, శ్రద్ధా కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దసరాకు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. త్రివిక్రం మనసు పెట్టి చేస్తున్న ఈ సినిమా టైటిల్ దగ్గరనుండి జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. వరుస హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న యంగ్ టైగర్ ఈ సినిమాతో ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news