Gossipsస్క్రీన్ పై ఎన్టీఆర్ .…అదరహో .. రికార్డ్స్ బ్రేక్స్

స్క్రీన్ పై ఎన్టీఆర్ .…అదరహో .. రికార్డ్స్ బ్రేక్స్

స్వర్గీయ పద్మశ్రీ  డాక్టర్ నందమూరి తారక రామారావు  వారసత్వాన్ని టాలీవుడ్ లో కొనసాగిస్తున్న వారసుల్లో ప్రస్తుతం బాలకృష్ణ మరియు jr ఎన్టీఆర్ . ఎవరికివారు తనదైన శైలిలో వరస హిట్లతో దూసుకుపోతున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. టెంపర్ మరియు నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి సినిమాలో డిపెరెంట్ రోల్స్ చేస్తూ  బాక్స్ ఆఫీస్ హిట్స్ ను అందుకున్న యంగ్ టైగర్ ఇప్పుడు ఆ హిట్ చిత్రాలకు బిన్నంగా “జై లవకుశ” సినిమాతోకొత్తగా రాబోతున్నాడు. ఇప్పటికే టీజర్స్ తో పోస్టర్ లుక్ తో  రికార్డ్స్ క్రియేటివ్ చేస్తూ ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ రీసెంట్ గా మూడు పాత్రల లుక్స్ ఉన్న ఒక ఫోటోని సినిమా యూనిట్  సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు ..

పోస్టర్ ని చూస్తుంటే ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా కనిపిస్తున్నట్లు క్లియ్యర్ గా అర్ధమవుతోంది. ఎన్టీఆర్ కోపంతో పాటు చిరునవ్వు మరియు స్టైలిష్ లుక్స్ ఆ పోస్టర్ లో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. సినిమాలో జై పాత్ర  పుల్ యాక్షన్ సీన్స్ తో ఇరగదీస్తే, లవ పాత్ర కామెడీతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ నుంచి ఆశించే అసలైన డాన్సులతో కుశ పాత్ర  ప్రేక్షకులని విజిల్స్ వేయించడం గ్యారంటీ అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ సినిమాల్లో నటుడిగా తానేంటో నిరూపించుకున్న ఎన్టీఆర్ ఒక్కో సినిమాలో ఒక్క తరహా పాత్ర చేసి  తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. కానీ జైలవకుశ సినిమాలో ఒకే స్క్రీన్ పై  మూడు విభిన్న పాత్రలశైలితో కనిపిస్తున్నాడు అంటే తెలుగు ప్రేక్షకులు ఖుషి అవ్వాల్సిందే.

జై లవ కుశ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ సినిమాతో ఎన్టీఆర్ నటనలో విశ్వరూపం చూపిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఈ సినిమా పాజిటివ్ టాక్ ని  బాగానే తెచ్చుకుంది  ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్  నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news