Gossipsఎన్టీఆర్ ఒప్పుకుంటే బాగుండేది..!

ఎన్టీఆర్ ఒప్పుకుంటే బాగుండేది..!

మహానటి సినిమాపై వస్తున్న ప్రశంసలు అందరికి తెలిసిందే. సావిత్రి బయోపిక్ గా నాగ్ అశ్విన్ తలపెట్టిన ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ అయ్యింది. మరోసారి ఆమె మంచితనం గురించి అందరు మాట్లాడుకునేలా చేసింది. నిన్న రిలీజ్ అయిన మహానటి సినిమా అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్రపై మాత్రం నందమూరి ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.

ఏయన్నార్ గా నాగ చైతన్య ఐదారు సీన్స్ లో కనిపించి అలరించాడు. ఎన్.టి.ఆర్ పాత్రలో ఒకసారి గ్రాఫిక్స్ తో మేనేజ్ చేశారు. మరోసారి ఎన్.టి.ఆర్ ఫోటో పెట్టి నడిపించారు. జూనియర్ ఎన్.టి.ఆర్ ఆ పాత్రలో నటించుంటే బాగుండేదని ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తాత పాత్రలో ఈ జీవితంలో నటించేది లేదని మొన్నమధ్య ఎన్.టి.ఆర్ చెప్పాడు.

అయితే కొన్ని సందర్భాల్లో అలా కనిపించడం వల్ల కొంత మేలే జరుగుతుందని అది అభిమానుల కోరికని గుర్తిస్తే మంచిది. మహానటిలో ఎన్.టి.ఆర్ గా తారక్ కనిపించి ఉంటే సినిమాకు మరో కొత్త క్రేజ్ వచ్చేది. కాని ఆ పాత్రలో ససేమీరా ఒప్పుకోలేదు ఎన్.టి.ఆర్. మొత్తానికి సినిమా అయితే సూపర్ సక్సెస్ అయ్యింది. కీర్తి సురేష్ అభినయానికి నేటితరం మహానటి ఆమె అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news