Gossipsచంద్రశేఖర్ ఏలేటితో ఎన్టీఆర్.. రిస్క్ చేస్తున్నాడా..ఏమంటారు ?

చంద్రశేఖర్ ఏలేటితో ఎన్టీఆర్.. రిస్క్ చేస్తున్నాడా..ఏమంటారు ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబి డైరక్షన్ లో జై లవకుశ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న తారక్ ఆ తర్వాత సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చంద్రశేఖర్ ఏలేటి డైరక్షన్ లో మూవీ చేస్తున్నారట. అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు కాని ఏలేటితో ఎన్.టి.ఆర్ సినిమా పక్కా అని అంటున్నారు.

లాస్ట్ ఇయర్ మనమంతా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చంద్రశేఖర్ ఏలేటి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయాడు. ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ముందుండే చంద్రశేఖర్ ఏలేటి ఎన్.టి.ఆర్ కు సరిపోయే ఓ కథ రాసుకున్నాడట. ఈమధ్యనే ఎన్.టి.ఆర్ కు ఆ లైన్ కూడా వినిపించాడని టాక్.

ఏలేటితో సినిమా నమ్మడానికి కాస్త టైం తీసుకున్నా తారక్ ను ఇంప్రెస్ చేసే కథ సిద్ధం చేశాడంటే కచ్చితంగా ఈసారి చంద్రశేఖర్ ఏలేటి పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news