Gossipsతేజ క్విట్.. యంగ్ ఎన్టీఆర్ తోనే సమస్య..?

తేజ క్విట్.. యంగ్ ఎన్టీఆర్ తోనే సమస్య..?

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మించదలిచారు. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ పోశిస్తున్న ఈ సినిమా ఓ సీనియర్ దర్శకుడు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో తేజాకు దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. ఆరంభం అట్టహాసంగా జరిగిన ఈ సినిమా ప్రెజర్ ను తట్టుకోలేక తేజ క్విట్ అవడం జరిగింది.

తేజ సినిమా ప్రాజెక్ట్ నుండి బయటకు రావడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. బయటకు వినిపించేది మాత్రం ఆ అంచనాలను అందుకోకపోతే దర్శకుడిగా తన మీదే అందరి గురి ఉంటుందని.. పని ఒత్తిడి కూడా ఎక్కువైందని.. ఇక కథ కథనాల్లో తన ప్రమేయం ఏమి లేకుండా కేవలం డైరక్టర్ అన్న ట్యాగ్ ఒక్కటే తన పని అయ్యిందని తేజ బయటకు వచ్చాడని అన్నారు.

కాని ఇక్కడ మరో విషయం ఏంటంటే ఎన్.టి.ఆర్ యంగ్ పాత్రలో జూనియర్ ఎన్.టి.ఆర్ ను పెడదామన్న తేజా వాదనను పక్కన పెట్టాడట బాలకృష్ణ. పదే పదే అదే విషయం మీద చర్చలు జరిపారట బాలకృష్ణ మాత్రం అది జరిగే పనికాదని చెప్పేశాడట. ఇద్దరి మధ్య వాగ్వివాదం కూడా జరిగిందని తెలుస్తుంది. చిత్రయూనిట్ ఇస్తున్న లీకులను బట్టి తేజ మీద బాలయ్య చేయి కూడా చేసుకున్నాడని అంటున్నారు.

ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని ఫైనల్ గా తేజ కూడా ఎన్.టి.ఆర్ బయోపిక్ నుండి ఎక్సిట్ అయ్యాడు. మరి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news