Gossipsత్రివిక్రం పుణ్యమాని కళ్యాణ్ కు దూరమైన ఎన్టీఆర్..!

త్రివిక్రం పుణ్యమాని కళ్యాణ్ కు దూరమైన ఎన్టీఆర్..!

నందమూరి బ్రదర్స్ ఇద్దరు మంచి అండర్ స్టాండింగ్ తో ఉంటారని తెలిసిందే. అన్న కళ్యాణ్ రాం, తమ్ముడు ఎన్.టి.ఆర్ వారు ఇద్దరు కనిపించే తీరు ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది. ఎన్.టి.ఆర్ ఏ సినిమా అయినా కళ్యాణ్ రాం సపోర్ట్ ఉంటుంది. ఇక కళ్యాణ్ రాం ఏ సినిమా తీసినా ఎన్.టి.ఆర్ వెనుక ఉంటాడు. ఆడియో రిలీజ్ కు పక్కాగా వస్తాడు. అయితే రాబోతున్న ఎం.ఎల్.ఏ ఈవెంట్ కు మాత్రం తారక్ కనిపించలేదు.

ఎన్.టి.ఆర్ వస్తున్నాడు వస్తున్నాడు అంటూ హంగామా చేశారు కాని అది జరగలేదు. కనీసం బాలకృష్ణ అయినా వస్తాడేమో అనుకున్నా అది కుదరలేదు. త్రివిక్రం సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్న ఎన్.టి.ఆర్ ఇప్పుడప్పుడే ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు ఇష్టపడట్లేదు. త్రివిక్రం చెప్పడం వల్లే కళ్యాణ్ రాం ఎం.ఎల్.ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ దూరంగా ఉండాల్సి వచ్చింది.

ఇక ఎన్.టి.ఆర్ ఈ ఈవెంట్ కు రాకపోవడం పై వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే తారక్ బదులు బాలకృష్ణ గెస్ట్ గా వస్తారని అన్నారు. అందుకే బాబాయ్ వచ్చేప్పుడు తానెందుకని ఎన్.టి.ఆర్ వెనక్కి తగ్గి ఉంటాడని అంటున్నారు. మొత్తానికి కళ్యాణ్ రాం స్పెషల్ ఈవెంట్ కు కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా మమా అనిపించేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news