Newsఇప్పుడు బాలయ్య టార్గెట్ ఎన్టీఆర్ మాత్రమే.!

ఇప్పుడు బాలయ్య టార్గెట్ ఎన్టీఆర్ మాత్రమే.!

100 సినిమాలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న నందమూరి నట సింహం బాలయ్య. శాతకర్ణి సినిమాతో 100వ సినిమా చరిత్రలో మిగిలిపోయేలా చేశాడు. ఇక 101, 102 సినిమాలు కూడా వచ్చాయి. రీసెంట్ గా జై సింహా అంటూ వచ్చి సత్తా చాటాడు బాలయ్య. ఇక ప్రస్తుతం 103వ సినిమాగా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నటిస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగష్టు నుండి సెట్స్ మీదకు వెళ్తుంది. తేజ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఎన్.టి.ఆర్ జీవితంలోని వాస్తవాలన్ని ప్రస్థావించడం జరుగుతుందట. దీని మీద చిన్నపాటి రీసెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య పూర్తి దృష్టి అంతా ఎన్.టి.ఆర్ బయోపిక్ మీదే పెట్టాడట.

చరిత్రలా మిగిలిన అన్న గారి జీవిత గాధను చరిత్రలో నిలిచిపోయే సినిమాగా తెరకెక్కించాలని బాలయ్య ప్రయత్నిస్తున్నాడు. ఇక సినిమాలో ఇందిరాగాంధి రోల్ కోసం వేట మొదలు పెట్టారట. ఆ పాత్రలో విజయశాంతి లేదా నదియా.. ఇద్దరిలో ఒకరు ఫైనల్ అవుతారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news