Newsనిహారికతో పెళ్లి.. రెండు మూడేళ్ల తర్వాతే..! : పెళ్లి రూమర్ల పై...

నిహారికతో పెళ్లి.. రెండు మూడేళ్ల తర్వాతే..! : పెళ్లి రూమర్ల పై నాగ శౌర్య అదిరిపోయే సమాధానం

యువ హీరో నాగ శౌర్య, మెగా డాటర్ నిహారికల మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని.. ఇద్దరు త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. నాగ శౌర్య నటించిన ఛలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రావడంతో ఈ వార్తలకు మరింత బలం వచ్చింది. ఈ న్యూస్ పై ఫైనల్ గా స్పందించాడు నాగ శౌర్య. ఛలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ వార్తల గురించి మీడియాకు వివరణ ఇచ్చాడు.

తనకు నిహారికతో పెళ్లి వార్తలపై ఎలాంటి వాస్తవం లేదని. ఇద్దరం ఎవరి కెరియర్ లో వారు బిజీగా ఉన్నామని. జస్ట్ కలిసి సినిమా చేశాం అంతే తప్ప మామధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని అంటూ చెప్పుకొచ్చాడు నాగ శౌర్య. అంతేకాదు ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయినే చేసుకుంటానని.. ఇంకా తన పెళ్లికి మరో రెండు మూడేళ్లు టైం ఉందని అంటున్నాడు ఈ యువ హీరో.

నాగ శౌర్య, నిహారిక లీడ్ రోల్స్ లో ఒక మనసు సినిమా చేశారు. రామరాజు డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. హీరోయిన్ గా నిహారికకు మొదటి ప్రయత్నమే అయినా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రస్తుతం నిహారిక హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నటిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news