Gossipsలైవ్ లో రాశి ఖన్నా.. అందరు సిద్ధంగా ఉండండి..!

లైవ్ లో రాశి ఖన్నా.. అందరు సిద్ధంగా ఉండండి..!

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా అంతై కాలంలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. ఈ ఇయర్ అమ్మడు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద లక్ టెస్ట్ చేసుకోబోతున్నాయి. రేపు రిలీజ్ అవబోతున్న టచ్ చేసి చూడుతో పాటుగా.. వచ్చే వారం వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమాతో కూడా రాబోతుంది రాశి ఖన్నా.

ఈ రెండు సినిమాలకు ఒకేసారి ప్రమోట్ చేసేలా తన ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తుంది రాశి. అదెలా అంటే ఈరోజు 2 గంటలకు ఫేస్ బుక్ లైవ్ చాట్ లోకి వస్తా అంటుంది రాశి ఖన్నా. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో వెళ్లడించింది. రాశి ఖన్నా ఫ్యాన్స్, ఫాలోవర్స్ కు ఇది లక్కీ ఛాన్స్. ఆమెను అడగాలనుకునే ప్రశ్నలు, ఆమెతో మాట్లాడుకునే అభిమానులు ఈ లైవ్ చాట్ కు సిద్ధంగా ఉండండి.

సినిమా ప్రమోషన్స్ తో పాటుగా తమ ఫాలోయింగ్ కూడా పెంచుకునేలా హీరోయిన్స్ ఈ సరికొత్త ప్రమోషనల్ యాక్టివిటీ అదేనండి ఫేస్ బుక్ లైవ్ చాట్ కు రెడీ అవుతున్నారు. మరి రాశి ఖన్నా లైవ్ చాట్ ఏవిధంగా సాగుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news