Gossipsనా పేరు సూర్య హిట్టా.. ఫట్ట.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

నా పేరు సూర్య హిట్టా.. ఫట్ట.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

నా పేరు సూర్య అంటూ ప్రపంచవ్యాప్తంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వక్కంతం వంశీ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా బన్ని నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. యాంగ్రీ సోల్జర్ గా బన్ని తన నట విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమా ఓవరాల్ గా యావరేజ్ టాక్ తో మొదలవగా కచ్చితంగా హిట్ అవుతుందని చెబుతున్నారు. సినిమా కథ మొత్తం సీరియస్ మోడ్ గా నడవడం.. ఎంటర్టనింగ్ కు తక్కువ స్కోప్ ఇవ్వడం మైనస్సులనిపించినా స్టైలిష్ స్టార్ స్టైలిష్ యాక్షన్, సాంగ్స్, ఫైట్స్, డ్యాన్స్ ఇవన్ని సినిమాకు అదనపు ఆకర్షణలని చెప్పొచ్చు.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్ని నా పేరు సూర్యతో కూడా హిట్ కొట్టాడన్న టాక్ వచ్చింది. అయితే దర్శకుడు మొదటి సినిమా కాబట్టి సినిమా గ్రిప్పింగ్ విషయంలో కొంత ల్యాగ్ ఏర్పడిందని చెబుతున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయని తెలుస్తుంది. అను ఎమ్మాన్యుయెల్ కూడా అదరగొట్టేసింది. మ్యూజిక్ కూడా సినిమాకు ప్రధాన బలం గా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news