Gossipsఆ సినిమా లో నటించడం లేదట..!

ఆ సినిమా లో నటించడం లేదట..!

మెగా అల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తో సుప్రీమ్ సినిమా తీసి హిట్ కొట్టాడు అనీల్ రావిపూడి. ఓ మోస్త‌రు క‌థ‌నే త‌న‌దైన టేకింగ్ తో ఆక‌ట్ట‌కుని మెగా అభిమానుల మ‌న్న‌న‌లు అందుకున్నాడు. దిల్ రాజు బ్యాన‌ర్  కి కూడా ఆర్థికంగా పర్వాలేద‌నిపించే ప్రాజెక్టునే అందించాడు. అటుపై మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌తో  రాజా ద గ్రేట్ సినిమా చేసిన సంగ‌తి తెల్సిందే. సెన్సార్ పూర్తైన ఈ చిత్రానికి సంబంధించి ఓ రూమ‌ర్ ఇండ‌స్ట్రీలో హ‌ల్ చల్ చేస్తోంది.

దీనిపై త‌న వివ‌ర‌ణ ఇచ్చాడు డైరెక్ట‌ర్ అనీల్‌.. ఇంత‌కూ అదేంటంటే.. రాజా ది గ్రేట్ సినిమాలో సాయిధరమ్ తేజ్ అతిథి పాత్రపై క్లారిటీ ఇచ్చాడు. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా రాజా ది గ్రేట్ సినిమాలో తేజు అతిథి పాత్ర పోషించడం లేదని  తేల్చేశాడు.గతంలో రాజా ది  గ్రేట్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అనిల్ రావిపూడి, రవితేజ, మెహ్రీన్ ఫిర్జాదా, రాశి ఖన్నా, సాయిధరమ్ తేజ్ లు అందరూ కలిసి తీసుకున్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.దీంతో రాశీఖన్నా లాగే తేజూ కూడా ఇందులో గెస్ట్ రోల్ పోషిస్తున్నాడా అనే ప్రచారం ఊపందుకుంది.

కానీ అటువంటిదేమీ లేదని చెప్పి ఆడియెన్స్, అభిమానులని సస్పెన్స్ లోంచి బయటపడేశాడు అనీల్ రావిపూడి. ఇక ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా ఈ నెల 18న విడుద‌లై థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.ఎప్ప‌టిలానే సాయి కార్తీక్ స్వ‌రాలు మాస్ ఆడియెన్స్‌ని క‌నెక్ట్ కావ‌డం ఖాయ‌మ‌ని, అంధుడిగా ర‌వితేజ న‌ట‌న ఈ చిత్రానికో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ అని నిర్మాత దిల్ రాజు చెబుతున్న మాట‌!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news