Gossipsగ్యారేజ్ దెబ్బకు మొబైల్స్ స్విచ్ఛాఫ్..

గ్యారేజ్ దెబ్బకు మొబైల్స్ స్విచ్ఛాఫ్..

ఈ రోజుల్లో మనం తిండిలేకుండా, నీళ్లు లేకుండా కొన్ని రోజులైనా ఉంటాం. కానీ చేతిలో మొబైల్ లేకుండా గంటైనా ఉండగలమా? లేదు. ఖచ్చితంగా మొబైల్ చేతిలో లేకపోతే అడుగు బయట పెట్టం. అలాంటిది ఇప్పుడు చాలామంది మొబైల్ స్విచ్చ్ ఆఫ్ చేసి పక్కన పెడుతున్నారు. మొబైల్ ఆన్ చేయాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటారా.. అదే జనతా గ్యారేజీ ఎఫెక్ట్.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్ల ఓనర్లదీ ఇదే పరిస్థితి. ఒక్క ఓనర్లేంటీ.. థియేటర్ మేనేజర్లు, అందులో పనిచేసేవాళ్లు, డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ల దగ్గర పనిచేసేవాళ్లు ఇలా బోలెడంతమంది తమ మొబైల్స్ ను ఇప్పటికే స్విచ్చ్ ఆఫ్ చేసుకున్నారు. జనతా గ్యారేజీ టిక్కెట్స్ కోసం వాళ్లకొస్తున్న ఒత్తిడితోనే ఇలా చేస్తున్నారంట. అంతేకాదు పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి అన్ని శాఖల అధికారులు కూడా టిక్కెట్స్ కోసం లాబీయింగ్ చేస్తున్నారంట. వీళ్లను తట్టుకోలేకనే ప్రస్తుతానికి మొబైల్స్ ఆపేసి కూర్చున్నారు.

అన్నట్లు చాలామంది మూవీ శుక్రవారం రిలీజ్ అనుకున్నారట. గురువారం అతి తెలుసుకునేసరికి చాలా లేటయ్యింది. దీంతో ఇప్పుడు టిక్కెట్స్ కోసం రోడ్డుమీద పడ్డారు జనాలు. కానీ బ్యాడ్ లక్ ఇప్పటికే లేటయ్యింది. టిక్కెట్స్ అన్నీ అమ్ముడయ్యాయ్…

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news