ప్రపంచ సుందరికి ‘ప్రాస్టిట్యూట్’ ఆఫర్.. ఒక రాత్రికి భారీ రేటు

miss world 2015 natasha gets prostitution offer for huge amount

Miss World 2015 Natasha gets prostitution offer from a woman in Singapore for huge amount. But she rejects this offer.

2015లో ప్రపంచ సుందరిగా ఎంపికైన నటాషాకు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఇటీవల ఈ అమ్మడు ఓ పని నిమిత్తం సింగపూర్‌కి వెళ్ళగా.. అక్కడ ఓ మహిళ ఆమె వద్దకు వచ్చింది. తొలుత తన గురించి చెప్పి, కాసేపు మాటలు కలిపిన ఆ మహిళ.. ఒక్కసారిగా తన స్టేట్‌మెంట్‌తో నటాషాకి షాకిచ్చింది. తనకు తెలిసిన బడా పారిశ్రామిక వేత్తతో ఒక్క రాత్రి పడుకుంటే.. కావాల్సినంత డబ్బులు ఇప్పిస్తానని ఆఫర్ ఇచ్చింది. అంటే.. వ్యభిచారం చేయమని నేరుగా అడిగింది. అంతేకాదు.. పిలిచినప్పుడల్లా క్లయింట్లతో వ్యభిచరస్తే, ఊహకందని రేంజులో డబ్బులిస్తానని, నీ కెరీర్ అనుకోని మలుపు తిరుగుతుందని ఆ మహిళ నటాషాకి చెప్పింది.

దీంతో ఖంగుతిన్న నటాషా.. కోపంతో ఊగిపోయింది. అప్పటికప్పుడే ఆ మహిళకి ధీటైన సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియా ద్వారా కూడా బదులిచ్చింది. ఈ తరహా ఆఫర్లు తనకు ఏమాత్రం ఇష్టం లేదని, దయచేసి ఇంకెప్పుడూ ఇలాంటి అభ్యర్థనలు ఎవ్వరూ చేయొద్దని తెలిపింది. ఇలా నటాషా అభ్యర్థన చేసినప్పటికీ.. ఆ మహిళ నుంచి నటాషాకి మరో సందేశం వచ్చిందట. ‘నువ్వు కోరుకున్నంత డబ్బులు ఇస్తాను.. ఇప్పుడైనా ఇష్టమా? ఒప్పుకుంటావా?’ అని అడిగిందట. అది చూసి మరోసాకి షాక్‌కి గురైన నటాషా.. ఈసారి ఘాటుగా సమాధానమిచ్చింది. ఇంకోసారి వ్యభిచారం చేయమని విసిగిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని సదరు మహిళకి చెప్పింది. దీంతో.. ఆ అమ్మడు నటాషాని సంప్రదించడం ఆపేసింది. ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో నటాషా చెప్పుకొచ్చింది.

నిజానికి.. విదేశాల్లో కొందరు వ్యక్తులు బాగా పేరు సంపాదించుకున్న మహిళల్ని టార్గెట్ చేసి, ఇలా ఆఫర్లు చేస్తుంటారు. ఇలాంటివారితో వ్యభిచారం చేయిస్తే.. క్లయింట్ల దగ్గరనుంచి భారీ డబ్బులు వసూలు చేయవచ్చునన్నది వారి ఆశ. అందుకే.. వీలైనంతవరకు అందాల భామల్ని గాలం వేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ.. నటాషా వారి గాలంలో పడకుండా దిమ్మతిరిగేలా పై విధంగా కౌంటర్ ఇచ్చింది.

More from my site