Reviews" మనసుకి నచ్చింది " రివ్యూ & రేటింగ్

” మనసుకి నచ్చింది ” రివ్యూ & రేటింగ్

షో సినిమాతో నటిగా, నిర్మాతగా తన టాలెంట్ ఏంటో చూపించిన సూపర్ స్టార్ కృష్ణ తనయురాలు మంజుల నిర్మాతగా సక్సెస్ ఫుల్ సినిమాలు తీసింది. ఇక కొత్తగా మంజుల మెగా ఫోన్ పట్టుకుని చేసిన సినిమా మనసుకి నచ్చింది. సందీప్ కిషన్, అమైరా దస్తర్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది అన్నది ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

సూరజ్ (సందీప్ కిషన్), నిత్య (అమైరా దస్తర్) ఇద్దరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. కుటుంబాలు కూడా కలిసి ఉండటంతో ఇద్దరికి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. అయితే పెళ్లి ఇష్టం లేని సూరజ్, నిత్యా గోవాకు వెళ్తారు. అక్కడ సూరజ్, నిత్యాలకు నిక్కి (త్రిదా చౌదరి) పరిచయం అవుతుంది. సూరజ్ మీద ఉన్న స్నేహం కాస్త ప్రేమని గుర్తించిన నిత్య ఆ విషయం సూరజ్ కు చెప్పేలోగా.. నిక్కి అతన్ని ఇష్టపడుతుంది. ఇంతకీ సూరజ్, నిత్యల ప్రేమ ఫలించిందా..? నిక్కిని చూసి ఎట్రాక్ట్ అయిన సూరజ్ ఆమెను ప్రేమించాడా..? వీరి ప్రేమకథ ఎలా ముగిసింది అన్నది తెలియాల్సి ఉంది.

నటీనటుల ప్రతిభ :

సందీప్ కిషన్ క్యారక్టరైజేషన్ కాస్త కన్ ఫ్యూజింగ్ గా ఉన్నా.. తనవరకు బాగానే చేశాడు. లవర్ బోయ్ ఇమేజ్ కోసం బాగానే ప్రయత్నం చేశాడు. ఇక అమైరా దస్తర్ ఇంప్రెస్ చేసింది. రొమాంటిక్ సీన్స్ లో ఎట్రాక్ట్ చేసింది. ఇక త్రిధా చౌదరి అలరించింది. ఆమె గ్లామర్ టచ్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక ప్రియదర్శి సినిమా మొత్తం ఉన్నా సరిగా వాడుకోలేదనిపిస్తుంది. మంజుల కూతురు జాన్వి కూడా ఈ సినిమాతో తొలిపరిచయం అయ్యింది. ఇక నేచర్ గా మాట్లాడిన మహేష్ వాయిస్ ఇంప్రెస్ చేసింది. నాజర్, ఆదిత్, అనితా చౌదరి పాత్రలు ఎప్పటిలానే ఆకట్టుకున్నాయి.

సాంకేతికవర్గం పనితీరు :

రవి యాదవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. ఎడిటింగ్ మొదటి భాగం ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరక్షన్ పరంగా మంజుల మంచి మార్కులే కొట్టేసింది. అయితే కథ, కథనాల విషయంలో రొటీన్ పంథా కొనసాగించింది. నేచర్ తో ప్రేమికులను పోల్చి చెప్పిన విధానం బాగున్నా సరైన ఎక్స్ క్యూషన్ లేదని అనిపిస్తుంది.

విశ్లేషణ :

మనసుకు నచ్చింది.. సినిమా టైటిల్ లోనే స్టోరీ చెప్పేసిన డైరక్టర్ మంజుల. కథా వస్తువు అంత పకడ్బందీగా రాసుకోలేదు. ఇద్దరు ప్రేమికులు, నేచర్ తో కనెక్ట్ అవడం.. వారి ప్రేమకు నేచర్ సాక్ష్యం అవడం ఇలా కొంతమేరకు కాస్త మ్యాజిక్ అనిపించినా అక్కడక్కడ బోర్ కొట్టేస్తుంది. ముఖ్యంగా లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో కూడా తేడా కొట్టేస్తుంది.

మొదటి భాగం పాత్రల పరిచయం.. వాటి డెవలప్మెంట్ అయితే ఇది కాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్ లో మంజుల మొదటి సినిమా డైరక్షన్ అని పక్కాగా తెలిసిపోతుంది. తనవరకు బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం మెచ్చుకునేదే. ఇక సినిమా లో ఎమోషనల్ సీన్స్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉండాల్సింది.

మొత్తానికి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన మనసుకి నచ్చింది మూవీ.. మనసుకి నచ్చేలా ఉన్నా కథనంలో మనసుకి చేరువేయలేకపోయారని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

సినిమాటోగ్రఫీ

హీరోయిన్స్

స్టోరీ థీం

మైనస్ పాయింట్స్ :

స్టోరీ

స్క్రీన్ ప్లే

రొటీన్ డ్రామా

బాటం లైన్ :

మనసుకి నచ్చింది.. అటు ఇటుగా మనసుకి నచ్చేలా ఉంది..!

రేటింగ్ : 1.75/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news