Gossipsఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్ రోల్ లీక్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్ రోల్ లీక్..!

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో ఎన్.టి.ఆర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ పోశిస్తున్న ఈ సినిమా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నాడని మొన్నామధ్య వార్తలు వచ్చాయి.

ఇక ఇప్పుడు ఆ వార్తలకు ఊతం అందిస్తూ ఎన్.టి.ఆర్ బయోపిక్ లో సూపర్ స్టార్ కృష్ణ రోల్ లో మహేష్ బాబు నటిస్తున్నాడని అంటున్నారు. తేజ డైరక్షన్ లో నిజం సినిమా చేశాడు మహేష్. ఇక బాలయ్యతో కలిసి నటించలేదు. ఇండస్ట్రీలో బడా హీరోలుగా ఉన్న బాలకృష్ణ, మహేష్ అసలు సిని వేడుకలకు కూడా కలిసిన దాఖలాలు లేవు.

అయితే కృష్ణ పాత్రలో మహేష్ నటిస్తున్నాడన్న వార్తలు బయటకు వచ్చాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నది తెలియాల్సి ఉంది. దసరాకి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ దాదాపు 60 గెటప్పులలో కనిపిస్తారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news