Gossipsకృష్ణార్జున యుద్ధం.. ఏదో తేడా కొడుతుంది నాని..!

కృష్ణార్జున యుద్ధం.. ఏదో తేడా కొడుతుంది నాని..!

నాచురల్ స్టార్ గా నాని వరుస విజయాలతో దూసుకెళ్తుంటే ఓ సినిమా వచ్చిన మూడు నెలల్లోనే మరో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. 2017 డిసెంబర్ లో ఎం.సి.ఏ అంటూ వచ్చి హిట్ అందుకున్న నాని రాబోయే శుక్రవారం కృష్ణార్జున యుద్ధంతో రాబోతున్నాడు. మేర్లపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రుస్కాన్ నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా నిన్న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఏ స్ర్టిఫికెట్ అందుకుంది. సినిమాలో నాని డ్యుయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే సినిమా రిలీజ్ కు వారం ఉండగా ఆ సినిమా గురించి కాకుండా సెట్స్ మీద ఉన్న శ్రీరాం ఆదిత్య గురించి నాని ట్వీట్ చేశాడు. నాగార్జునతో మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమా గురించి నాని మాట్లాడటంపై కృష్ణార్జున యుద్ధంపై డౌట్ పడుతున్నారు.

సాంగ్స్, ట్రైలర్ అంతా రొటీన్ కామెడీ ఎంటర్టైనర్ అనిపిస్తుండటంతో ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో అని ఎదురుచూస్తున్నారు. ఒకవేళ నాని హిట్ మేనియాకు ఈ సినిమా బ్రేక్ వేస్తే కనుక మళ్లీ నాని వెనక పడ్డట్టే. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news