Movies" కృష్ణార్జున యుద్ధం " 1st డే కలెక్షన్స్

” కృష్ణార్జున యుద్ధం ” 1st డే కలెక్షన్స్

“నాని” తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు. తనదైన నటనతో హావభావాలతో ప్రేక్షకుల చేత న్యాచురల్ స్టార్ అనిపించుకున్నాడు ఈ యువ హీరో. గత కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నాని. 2015 లో విడుదలైన భలే భలే మగాడివోయ్ నుండి వరుసగా 8 ఘన విజయాలు అందుకున్నాడు. ఇక గత సంవత్సరం వచ్చిన MCA నాని సినీ కెరీర్ లోనే మొదటిసారి 40 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇక ఇప్పుడు రీసెంట్ గ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం కృష్ణార్జున యుద్ధం.
ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్, ట్రైలర్ మరియు ఆడియో సాంగ్స్ కి మంచి ఆదరణ లభించింది. దీంతో సినిమా పై బారి అంచనాలు నెలకొన్నాయి.

నిన్న గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా కొన్ని ప్రాంతాలలో డివైడ్ టాక్
తెచ్చుకుంది. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద 17.5 కోట్ల గ్రాస్ 10 కోట్లకు పైగా షేర్ ని “కృష్ణార్జున యుద్ధం” కలెక్ట్ చేసిందని ట్రేడ్ సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news